సోషల్ మీడియాలో చురుకుగా ఉండే టాలీవుడ్ (Tollywood) తారల్లో మొదటి స్థానంలో ఉంటుంది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). తన రోజూ వారి అప్ డేట్స్ ను ఎప్పటికపుడు నెట్టింట్లో అందరితో పంచుకుంటుంది రకుల్. ప్రతీ సారి కొత్త కొత్త డ్రెస్సుల్లో కనిపిస్తూ అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ బ్యూటీ ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన స్టిల్స్ వైరల్ అవుతున్నాయి. రకుల్ టై డై కో ఆర్డినేషన్ (tie dye co ord outfit)డ్రెస్సులో క్యాజువల్ అవుట్ ఫిట్ లో హొయలు పోతూ కెమెరాకు పోజులిచ్చింది.
సాల్జ్ ఎన్ సాండ్, అన్షి కావ్ రూపొందించిన డ్రెస్సులో స్టన్నింగ్ గా అదిరిపోయే స్టిల్స్ ను పోస్టు చేసింది. దుస్తులు, వస్త్రాలతో ప్రేమలో అంటూ ఫొటోలకు క్యాప్షన్ పెట్టింది. అంతకుముందు తన మేకప్ ను త్వరగా పూర్తి చేసేందుకు రకుల్ టీం ప్రయత్నిస్తుంటే..త్వరగా పూర్తి చేయండి అంటూ అడుగుతున్న క్యూట్ వీడియోను పోస్ట్ చేసింది. ఎల్లప్పుడూ నా వ్యక్తీకరణ..పూర్తయింది అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో కొండపొలం (Konda Polam) సినిమా చేస్తోంది. హిందీలో అజయ్ దేవ్ గన్, సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి థ్యాంక్ గాడ్ సినిమాలో నటిస్తోంది. మరోవైపు జాన్ అబ్రహాంతో అటాక్ మూవీ చేస్తోంది. తమిళంలో కమల్ హాసన్ తో ఇండియన్ 2, శివకార్తికేయన్ నటిస్తోన్న అయలాన్ చిత్రాలు చేస్తోంది.
Aditi Rao Hydari | చీరకే అందం తెచ్చిన హైదరాబాదీ భామ
Dubai sheik SP balu song| దుబాయ్ షేక్ నోట ఎస్పీ బాలు పాట..వీడియో వైరల్
Bangarraju | బంగార్రాజు టీం ఎక్కడికెళ్లిందో తెలుసా..?