Aditi Rao Hydari | చీరకే అందం తెచ్చిన హైదరాబాదీ భామ
చీరలోని గొప్పతనం తెలుసుకో..ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో..ఈ పాట నా కోసమే రాశారా..? అన్నట్టుగా చీరకట్టులో మెరిసిపోతుంది హైదరాబాదీ సుందరి అదితీ రావు హైదరి (Aditi Rao Hydari).

‘చీరలోని గొప్పతనం తెలుసుకో..ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో..సింగారమనే దారంతో చేసిందీ చీర. ఆనందమనే రంగులనే అద్దిందీ చీర..మమకారమనే మగ్గంపై నేసింది చీర’ అంటూ చీర గొప్పదనం గురించి రాసిన పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పల్లకిలో పెళ్లి కూతురు చిత్రంలో చీర ప్రాముఖ్యతను, గొప్పదనాన్ని వర్ణిస్తూ వచ్చే ఈ పాటను చంద్రబోస్ అద్బుతంగా రాశారు.

ఈ పాట నా కోసమే రాశారా..? అన్నట్టుగా చీరకట్టులో మెరిసిపోతుంది హైదరాబాదీ సుందరి అదితీ రావు హైదరి (Aditi Rao Hydari). ఇటీవలే మహాసముద్రం (Mahasamudram) సినిమాలో నుంచి చెప్పకే చెప్పకే (Cheppake Cheppake) అని పాటను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పాట కోసం అదితీ రావు సాగర తీరంలో చీర కట్టులో రొమాంటిక్ టచ్ తో అందాలు ఆరబోసిన స్టిల్స్ బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
అదితీ రావు ముదురు ఎరుపు రంగు చీర, గళ్ల జాకెట్లో సంప్రదాయ చీరకట్టులో కనిపిస్తూ థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని తాజా ఫొటోలతో స్పష్టమవుతోంది. చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన చెప్పకే చెప్పకే పాటలో అదితీరావుతోపాటు శర్వానంద్, సిద్దార్థ్, అనూ ఇమ్మాన్యుయేల్ కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి..
Sehwag: పవన్ డైలాగ్‌తో సెహ్వాగ్ క్రేజీ వీడియో వైరల్
Rashmika Mandanna | రష్మిక మందన్నా హింట్ ఇచ్చిందా..!
Bangarraju | బంగార్రాజు టీం ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

