e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home సినిమా సాహసాలు చేయాల్సిందే

సాహసాలు చేయాల్సిందే

సాహసాలు చేయాల్సిందే

ఒత్తిడితో కూడిన నేటి బిజీలైఫ్‌లో మనసుకు ఆహ్లాదాన్ని పంచే వ్యాపకాల కోసం సమయాన్ని కేటాయించాలని చెబుతోంది రకుల్‌ప్రీత్‌సింగ్‌. కోరుకున్న ఆనందాలన్నీ పొందగలిగినప్పుడే జీవితానికి అర్థం ఉంటుందని అంటోంది. ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉంది రకుల్‌ప్రీత్‌సింగ్‌. మరోవైపు వ్యాపారవేత్తగా రాణిస్తోంది. బిజీలైఫ్‌ కారణంగా ఎదురయ్యే ఒత్తిడుల నుంచి ఎలా దూరమవుతారని అడగ్గా స్కూబా డైవింగ్‌, ట్రెక్కింగ్‌ లాంటి సాహసాలతో మానసికోల్లాసాన్ని పొందుతానని బదులిచ్చింది రకుల్‌ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ ‘వ్యక్తిగత జీవితాల కోసం సమయాన్ని కేటాయించే అవకాశం తారలకు అరుదుగా దొరుకుతుంది. అలా దొరికే కొద్ది పాటి టైమ్‌ను వృథా చేయడం నాకు ఇష్టం ఉండదు. షూటింగ్‌ల నుంచి విరామం దొరకడమే ఆలస్యం స్కై డైవింగ్‌, స్కూబా డైవింగ్‌ లాంటి సాహసోపేతమైన క్రీడల్లో పాల్గొంటా. లేదంటే జనజీవనానికి దూరంగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ట్రెక్కింగ్‌, మెడిటేషన్‌తో సేదతీరుతా. నచ్చిన ఆటలు ఆడుతుంటా. అవే నాలోని ఒత్తిడిని దూరం చేయడానికి ఉపకరిస్తాయి. మనసుకు సాంత్వన చేకూర్చే అంశాలేమిటో తెలుసుకోవడం ముఖ్యం. కఠిన సమయాల్లో మనలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి ఆ వ్యాపకాలు ఉపయోగపడతాయి’ అని తెలిపింది. ప్రస్తుతం రకుల్‌ప్రీత్‌సింగ్‌ బాలీవుడ్‌లో ఎటాక్‌, మేడే, థాంక్‌ గాడ్‌తో పాటు తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తోంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సాహసాలు చేయాల్సిందే

ట్రెండింగ్‌

Advertisement