Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2009లో కన్నడ చిత్రం గిల్లితో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగులో ‘కెరటం’ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తూ అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు గడుస్తున్నా తన అందచందాలతో అభిమానులను అలరిస్తూ వస్తున్నది. రకుల్ ఇటీవల కాస్మెటిక్ సర్జరీపై తన అభిప్రాయాలను వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఎప్పుడూ కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది.
తనకు దేవుడు అందమైన ముఖాన్ని ఇచ్చాడని.. కాబట్టి తాను అలాంటి వాటి గురించి ఆలోచించలేదు అని చెప్పింది. అయితే, ఇటీవల రకుల్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసిన వారంతా రకుల్ తన పెదవులకు ఏదో కాస్మెటిక్ సర్జరీ, ఫిల్లర్ (పెదవులు బొద్దుగా కనిపించేలా చేసే ఒక రకమైన ప్రక్రియ) చేయించుకున్నట్లుగా భావించారు.
దీనిపై రకుల్ స్పందిస్తూ ఎవరైనా అలా చేయించుకోవాలనుకుంటే తప్పులేదని చెప్పింది. గతంలో చాలావ్యాధులకు చికిత్స లేదని.. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిందని పేర్కొంది. అదేవిధంగా ఎవరైనా అందంగా కనిపించడానికి కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటే అందులో తప్పు లేదని చెప్పింది. ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే ‘మేరే హస్బెండ్ కీ బీవీ’లో కనిపించింది. ఈ సంవత్సరం ఆమె ‘ఇండియన్ 3’ సినిమాలో నటిస్తున్నది. అలాగే, బాలీవుడ్లో ‘దే దే ప్యార్ దే-2’లో నటిస్తున్నది. ఈ సినిమాలో సీనియర్ హీరో అజయ్ దేవ్‌గణ్‌తో జతకడుతున్నది.