De De Pyaar De 2 | బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ కాంబోలో వచ్చిన ‘దే దే ప్యార్ దే’. 2019లో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైర్కు సీక్వెల్‌గా వస్తోంది ‘దే దే ప్యార్ దే 2’ (De De Pyaar De 2). అన్షుల్ శర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), అజయ్ దేవ్గన్, మాధవన్ టీం ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉంది.
సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్ షో బిగ్‌బాస్ సీజన్ 19లో రకుల్ ప్రీత్ సింగ్ టీం సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ పార్ట్‌లో తనకంటే వయసులో చాలా చిన్నదైన ఆయేషా (రకుల్ ప్రీత్ సింగ్)ను ప్రేమ పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఆశిష్ (అజయ్ దేవగణ్) తన మాజీ భార్య (టబు) పర్మిషన్తోపాటు ఆమె కుటుంబం అంగీకారాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు.
ఆయేషా కుటుంబాన్ని ఆశీష్ ఎలా పెళ్లికి ఒప్పిస్తాడు అనే నేపథ్యంలో సీక్వెల్ సాగనుందని ఇప్పటికే ట్రైలర్ హింట్ ఇచ్చేస్తుంది. సీక్వెల్లో ఆయేషా తండ్రి రోల్లో కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఆర్. మాధవన్ నటిస్తున్నాడు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్కు లవ్ రంజన్ కథ అందించారు.
When Megastar #SalmanKhan joins #AjayDevgn on the dance floor it’s pure fireworks!
Grooving together on “Pehla Toh Doja Toh” two legends, one iconic vibe! #DeDePyaarDe2 #Bollywood pic.twitter.com/z55axosGDV— 𝗔𝗺𝗮𝗿 𝗕𝗵𝗼𝘀𝗮𝗹𝗲 (@Bhaiya_Bhosale) November 10, 2025
Tonight promo of #BiggBoss19 #DeDePyaarDe2 star cast is seen having fun with #SalmanKhan
It’s a delight to watch #AjayDevgn and #SalmanKhan together & playfully make fun of their own dance moves and sharing some hearty laughs on stage 😂♥️#RakulPreetSingh#RMadhwan #BB19 pic.twitter.com/9PjjXLg6dw
— Gaurav Mishra🇮🇳 (@Gaurav_5599) November 9, 2025
Sigma | విజయ్ తనయుడు డెబ్యూ మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్
Govinda | గోవిందా భార్య సంచలన వ్యాఖ్యలు .. ఇంకో జన్మ ఉంటే గోవిందా నా భర్తగా వద్దు ..
Suma | పాడ్‌కాస్ట్‌లో విడాకులపై క్లారిటీ ఇచ్చిన సుమ.. కలిసి కనిపించిన విడిపోలేదా అనే వారు