Rakul Preet Singh | అర్థం చేసుకోకుండా కామెంట్స్ చేస్తారు.. నెట్టింట నెగెటివిటీపై రకుల్ ప్రీత్ సింగ్
Rakul Preet Singh | పక్కా ప్రొఫెషనల్‌గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ అప్పడప్పుడు నెటిజన్లు, అభిమానులతో తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో పెరుగుతున్న నెగెటివిటీ గురించి మాట్లాడింది రకుల్.
Rakul Preet Singh | తెలుగు, తమిళం, హిందీ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ రకుల్ ప్రీత్ సింగ్. పక్కా ప్రొఫెషనల్‌గా ఉండే ఈ భామ అప్పడప్పుడు నెటిజన్లు, అభిమానులతో తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో పెరుగుతున్న నెగెటివిటీ గురించి మాట్లాడింది. సోషల్ మీడియా అనేది కొందరు జనాలు ముక్కుమొఖం తెలియని అకౌంట్లతో తరచూ కఠిన వ్యాఖ్యలు చేస్తూ నెగెటివిటీని ప్రచారం చేసే హబ్లాంటిది.
చాలా మంది వ్యక్తులు అజ్ఞాత ప్రొఫైల్స్‌తో స్వేచ్చగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. వారు చేస్తున్నకామెంట్ల ప్రభావం ఎలా ఉంటుందో కనీసం అర్థం చేసుకోరని చెప్పింది. అందరినీ మెప్పించడం అసాధ్యమన్న రకుల్ ప్రీత్ సింగ్ సెలబ్రిటీలు ఆన్లైన్లో వచ్చే అనవసరమైన ట్రోల్స్, విమర్శల వల్ల తమ ఫోకస్ మార్చుకోకూడదు. నెగెటివిటీని ఎదుర్కొనేందుకు వాటిని పట్టించుకోకుండా వ్యక్తిగత, వృత్తి పరమైన లక్ష్యాలపైన దృష్టి పెట్టడమే ఉత్తమ మార్గమనని చెప్పుకొచ్చింది.
ఇండియన్ 2 సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయక చాలా కాలమే అవుతుంది. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ నటిస్తోన్న రామాయణలో కీలక పాత్రలో నటిస్తోంది. రకుల్ నటించిన Pati Patni Aur Woh Do ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఈ భామ నెక్ట్స్ ఇండియన్ 3 చేయాల్సి ఉంది. మరి తెలుగు సినిమాలో ఎప్పుడు కనిపిస్తుందో చూడాలి.
Read Also :
Hyundai | హ్యుందాయ్ చార్జింగ్ టెన్షన్స్‌కు చెక్.. అందుబాటులోకి మరిన్ని చార్జింగ్ పాయింట్లు
TTD | టీటీడీ విద్యాదాన ట్రస్టుకు రూ.కోటి విరాళం
Skin Health | చర్మం సురక్షితంగా, కాంతివంతంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

