సీజన్ లాంటి నాయికలు ఎక్కడ వీలుంటే అక్కడ వాలిపోతుంటారు. తెలుగు (Telugu Cinema)లో హవా తగ్గిన రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ప్రస్తుతం ముంబైలో కెరీర్ ను వెతుక్కుంటున్నది. ఆమె రీసెంట్ గా జాన్ అబ్రహాంతో కలిసి అటాక్ అనే చిత్రంలో నటించింది. సైన్స్ ఫిక్షన్ కథ (Science Fiction)తో తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె డాక్టర్ సబా ఖురేషి పాత్రలో నటించింది. ఇది కాక రకుల్ నటించిన రన్ వే 34, మిషన్ సిండ్రెల్లా, డాక్టర్ జి, థాంక్ గాడ్..వంటి మరో నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
లాక్ డౌన్ ముందు రకుల్ చేసిన సినిమాలన్నీ ఇప్పుడు రిలీజ్‌కు వరుస క్యూ కట్టాయి. పూర్తయిన సినిమాల విడుదల సన్నాహాలు, ప్రచారం, కొత్త చిత్రాల ఎంపికలో తీరిక లేకుండానే ఉంది రకుల్. ఈ బిజీలో వీలు దొరికితే బాయ్‌ఫ్రెండ్ జాకీ భగ్నానీ (Jackky bagnani)తో టూర్లకు వెళ్తున్నది. బాయ్‌ఫ్రెండ్ విషయాన్ని గోప్యంగా ఉంచని రకుల్..ఎందుకో కారణం కూడా చెప్పేసింది.
రకుల్ స్పందిస్తూ..వ్యక్తిగత విషయాలను దాచడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కెరీర్‌తోనే తీరిక లేని నేను ఈ ఒత్తిడి కూడా తీసుకోలేదల్చుకోలేదు. అయినా మరొకరి వ్యక్తిగత జీవితాల గురించి ఇతరులకు ఇంత ఆసక్తి ఎందుకో అర్థం కాదు. తల్లి దండ్రులు, అన్నా చెల్లి ఉన్నట్లే మనకో తోడు ఉంటారు. అందులే వింతేముంది..అని అంది రకుల్. సెలబ్రిటీల జీవితాల్లో జరిగే ఏదైనా ఆసక్తి కలిగిస్తుందని రకుల్‌కు తెలుసు. అయినా ఇందులో ఇంట్రెస్ట్ ఏముందని అంటున్నదీ భామ.