Operation Raavan | బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడు ‘పలాస 1978’ ఫేం రక్షిత్ (Rakshit Atluri). ఈ చిత్రాల్లో ఒకటి ఆపరేషన్ రావణ్ (Operation RAAVAN). ఇప్పటికే విడుదల చేసిన మూవీ లుక్‌తోపాటు ఆపరేషన్ రావణ్ గ్లింప్స్ వీడియోకు మంచి స్పందన వస్తోంది. మీ ఆలోచనలే మీ శత్రువులు.. అనే ట్యాగ్‌లైన్‌తో ఇంటెన్సివ్‌గా, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ తో హింట్ ఇచ్చాడు డైరెక్టర్.
వెంకట సత్య డైరెక్షన్లో హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని ఆగస్టు 2న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. అయితే ఎవరూ ఊహించన విధంగా ఈ చిత్రాన్ని ముందుగానే అంటే జులై 26న రిలీజ్ చేస్తున్నట్టు కొత్త అప్డేట్ అందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ మూవీలో మలయాళ భామ సంగీర్తన విపిన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. పలాసలో కీలక పాత్రలో నటించిన సింగర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె మరోసారి కీ రోల్ పోషిస్తున్నాడు.
A Psycho Story ~ #OperationRaavan is preponed from August 2nd, now coming at theatres near you on 𝐉𝐔𝐋𝐘 𝟐𝟔𝐭𝐡! 😈💥
Trailer ▶️ https://t.co/SxOoeSD77n
In Cinemas #OperationRaavanOnJuly26💥@RakshitAtluri @sangeerthanaluv @lakshmilohith @SripalCholleti @GskMedia_PR… pic.twitter.com/7cl5I5Nii4
— BA Raju’s Team (@baraju_SuperHit) July 18, 2024
Shiva Balaji | 200 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశాం: నటుడు శివబాలాజీ
Shivam Bhaje | అశ్విన్ బాబు శివం భజే నుంచి రామ్ రామ్ ఈశ్వరం సాంగ్
Sai Pallavi | సాయిపల్లవికి తండేల్ టీం శుభాకాంక్షలు.. స్టిల్స్ వైరల్