Raju Yadav | ‘జబర్దస్త్’ ఫేం గెటప్‌శ్రీను హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘రాజు యాదవ్’. అంకిత ఖారత్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి కొత్త దర్శకుడు కృష్ణమాచారి దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది మేలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందంతో పాటు ఆహా సోషల్ మీడియాలో ప్రకటించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రాజు (గెటప్‌శ్రీను)కు ఒక ఆటలో భాగంగా అనుకోకుండా ముఖానికి గాయం అవుతుంది. అయితే అతడు కోలుకోవాలని ఫేస్ డాక్టర్లు సర్జరీ చేస్తారు. ఇక సర్జరీ చేసిన అనంతరం తన ఫేస్ ఎప్పుడు నవ్వుతునే ఉంటుంది. నవ్విన, ఎడ్చినా, కోపంలో ఉన్నా అతను నవ్వినట్లే కనిపిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి అనేది మూవీ స్టోరీ. కె.ప్రశాంత్‌రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రంలో ఆనంద్ చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సాయిరామ్ ఉదయ్.
#RajuYadav premieres July 24th only on aha@ahavideoIN @getupsrinu3 @RocketRaghava @mirchihemant @iamankitakharat @actorchakrapani @PawonRamesh @PrashanthUttar1 @santoshrajactor pic.twitter.com/Bzl9uA6Hi6
— Cinema Mania (@ursniresh) July 18, 2024
Also Read..