Priyadarshi | డార్లింగ్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణ: ప్రియదర్శి
‘థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూశాను. కామెడీ, ఎమోషన్స్‌కు వారు బాగా కనెక్ట్ అవుతున్నారు. సినిమా చూస్తూ మా అమ్మగారు క్లాప్స్ కొట్టడం చాలా ఆనందంగా అనిపించింది’ అన్నారు ప్రియదర్శి.
Priyadarshi | ‘థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూశాను. కామెడీ, ఎమోషన్స్‌కు వారు బాగా కనెక్ట్ అవుతున్నారు. సినిమా చూస్తూ మా అమ్మగారు క్లాప్స్ కొట్టడం చాలా ఆనందంగా అనిపించింది’ అన్నారు ప్రియదర్శి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘డార్లింగ్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. నభానటేష్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి అశ్విన్‌రామ్ దర్శకుడు. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో ప్రియదర్శి మాట్లాడుతూ ‘ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతున్నది.
అన్ని కేంద్రాల్లో అద్భుతమైన స్పందన లభిస్తున్నది. అందరూ థియేటర్లలో సినిమాను ఎంజాయ్ చేయండి’ అన్నారు. తాము ఊహించినట్లుగానే మహిళా ప్రేక్షకులు సినిమాను బాగా ఇష్టపడుతున్నారని, రాబోవు రోజుల్లో ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉందని దర్శకుడు అశ్విన్ రామ్ పేర్కొన్నారు. నభానటేష్ మట్లాడుతూ ‘ఇదొక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ద్వితీయార్థంలోని కొన్ని సన్నివేశాలకు ప్రేక్షకులు ఎమోషనల్‌గా ఫీలవుతున్నారు. ఈ సినిమా మా అంచనాలను అందుకుంది’ అని చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

