Dasari Narayana Rao | చందాలతో చదువుకున్న దాసరి నారాయణరావు!
దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకరత్న డా. దాసరి నారాయణ రావు గారు. ఆయన తన చిన్నతనంలో ఎన్ని కష్టాలు పడి తన చదువును కొనసాగించారో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక చిత్రాల దర్శకుడు గా ‘గిన్నిస్ పుటలకెక్కిన’ తెలుగు తేజం స్వర్గీయ దర్శకరత్న డా. దాసరినారాయణరావుగారు. ఎంతో మంది దర్శకులకు పాఠాలు నేర్పిన గురువు ఎంతో మంది నటీనటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకరత్న డా. దాసరి నారాయణ రావు గారు. ఆయన తన చిన్నతనంలో ఎన్ని కష్టాలు పడి తన చదువును కొనసాగించారో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఆయన ఆరోతరగతిలో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దారుణమైన స్థితిలో ఉండేదని, ఆ రోజుల్లో వున్న స్కూల్ ఫీజు మూడుం పావులా కూడా కట్టలేక వాళ్ళ నాన్నగారు బడిని మాన్పించారు. దాసరి నారాయణ గారి కుటుంబం చాలా పెద్దది. దాసరిని వాళ్ళ నాన్నగారు ఒక వడ్రంగి షాపులో పనికి పెట్టించారట అక్కడ ఆయన జీతం నెలకి ఒక రూపాయి వచ్చేదట. ఆరోతరగతిలో ఉత్తమ విద్యార్థినిగా బహుమతి అందుకున్న తనని చదువు మానేసి పనిలో చేర్పించారని దాసరిగారు చాలా బాద పడేవారట. కానీ తప్పని పరిస్థితి కుటుంబం చాలా దీన స్థితిలో వుంది అని తన మనసుకి సర్ధిచెప్పుకునేవారని అన్నారు దాసరి.
అయితే ఒకరోజు దాసరి వాళ్ల బడి మాస్టారు సైకిల్ చైన్ ఊడిపోయి ఆయన పనిచేసే షాపు ముందే ఆగడంతో దాసరి నారాయణ రావు గారు పరుగెత్తుకెళ్లి మాస్టారుకు సహాయం చేశారు. మాస్టారు తనని చూసి ఏరా బడి మానేసి రోడ్ల మీద తిరుగుతున్నావేంటి అని అడిగారు. అపుడు ఆ మాస్టార్ కి తన కుటుంబ పరిస్థితి అంతా చెప్పారు దాసరి ఆయన దాసరిని తన సైకిల్ మీద కూర్చోబెట్టుకోని వాళ్ళ నాన్నదగ్గరకే తీసుకెళ్ళారు మాస్టారు. చాలా మంచి విద్యార్థి నారాయణరావు మంచిగా చదివే విద్యార్థిని చదువు మాన్పించి పనికి పంపిస్తున్నారు ఏంటీ అని వాళ్ల నాన్నను అడిగారు. ఇప్పుడు ఇతనిని చదివిచ్చే పరిస్థిలో లేమండి ఫీజులు కట్టాలన్న పుస్తకాలు కొనాలన్న మా ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు అని చెప్పారు.
అయితే మాస్టారు నారాయణను నేను చదివిస్తానని బడికి తీసుకెళ్ళారు. తనని స్కూల్ తరగతి గదిలోకి తీసుకెళ్ళి విద్యార్థులందరితో నారాయణరావు బడి ఫీజు కట్టలేక స్కూల్ మాన్పించి పనిలోకి పంపిస్తున్నారు వాళ్ళ నాన్నగారు. మీరందరు ఎంతో కొంత డబ్బు సహాయం చేస్తే అతను చదువుకుంటాడు అని అందరి దగ్గర చందాలు అడిగారు. అందరూ విద్యార్థులు తమ దగ్గర ఉన్న అణాలు బేడాలు తీసి టేబుల్ మీద పెట్టారు. వాళ్ళంతా సహృదయంతో స్పందించారు. నా బడికి కావలసిని ఫీజుకు కావల్సిన డబ్బు రావడంతో నా చదువు మళ్ళీ మొదలైందని చెప్పారు దాసరి. బడిలో అయితే చేరారు కాని పుస్తకాలుండేవి కావు వాళ్ళ మిత్రుల దగ్గర తీసుకుని చదువుకునేవారు. ఆ విధంగా స్వర్గీయ డా.దాసరినారాయణరావు గారు చందాలతో తన చదువును కొనసాగించారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Also Read..
Ram Charan – IFFM 2024 | రామ్ చరణ్కు అరుదైన గౌరవం.. ఆస్ట్రేలియా ఫిలిం ఫెస్టివల్ నుంచి పిలుపు
Thangalaan Movie | ఇండిపెండెన్స్ బరిలో విక్రమ్.. విడుదల తేదీ ప్రకటించిన ‘తంగలాన్’
Vishwambhara Movie | మెగాస్టార్ ‘విశ్వంభర’ నుంచి లేటెస్ట్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

