దర్శకుడు ఓంకార్ హారర్ కామెడీ ఫ్రాంచైజీ ‘రాజుగారి గది’ నుంచి ఇప్పటివరకూ మూడు భాగాలు విడుదలయ్యాయి. త్వరలో ఈ ఫ్రాంచైజీ నుంచి 4వ భాగం రానుంది. ‘రాజుగారి గది 4 : శ్రీచక్రం’గా రానున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని శనివారం ఓ ప్రకటన ద్వారా పీపుల్ మీడియా సంస్థ తెలియజేసింది.
‘ఎ డివైన్ హారర్ బిగిన్స్’ అనే పవర్ఫుల్ ట్యాగ్‌తో రానున్న ఈ చిత్రం హారర్ సినిమాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని, కాళికాపురం అనే గ్రామం నేపథ్యంలో సాగే ఈ కథ హారర్ సినిమాగానే కాక, ఓ ఆధ్యాత్మిక యాత్రలా సాగుతుందని, 2026 దసరాకు సినిమాను విడుదల చేస్తామని ఓంకార్ తెలిపారు. పురాణ విశ్వాసాలు, హిడెన్ సీక్రెట్స్, మరిచిపోయిన వారసత్వాల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ డివైన్ హారర్ కామెడీ చిత్రానికి మాటలు: అజ్జు మహాకాళి, కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: ఎస్.ఎస్.థమన్.