Rajinikanth | సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాల్లో స్టయిలిస్ లుక్‌లో కనిపించే ఆయన.. మిగతా సమయాల్లో ఎక్కడికి వెళ్లినా వాటికి దూరంగా
ఉంటూ.. రియల్ గెటప్‌లోనే కనిపిస్తారు. తాజాగా రజనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. రజనీకాంత్ విమానం ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించగా.. ఆయనను చూసిన
ఉత్సాహంలో అభిమానులు ఈలలు, కేకలు వేశారు. ఇండిగో విమానం ఎకానమీ క్లాస్‌లోకి రాగానే ప్రయాణికులు ఫొటోలు, వీడియోలు తీస్తూ పలువురు తలైవా అంటూ పిలవడం కనిపించింది. రజనీ సైతం
నవ్వుతూ అభిమానులకు అభివాదం చేశారు. ఆ తర్వాత విమానం సిబ్బంది చూపించిన సీటులోకి వెళ్లి కూర్చోవడం కనిపించింది. ఈ వీడియోను చూసిన పలువురు భారీ ఆదరణతో విమానాన్ని థియేటర్‌గా
మార్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ మార్చేశారని.. ఆయనను చూసేందుకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసే వారి కల.. ఒకే ప్రయాణంలో సడెన్‌గా వస్తుందని ఏ మాత్రం ఊహించలేదని పలువురు వీడియోను షేర్ చేస్తూ కామెంట్ చేశారు.
No private jet, no makeup, no lavish costumes,no bgm —just the timeless, captivating aura of @rajinikanth resonating like an eternal melody ❤️✨️
A man who thrives in the company of his people 🙌 pic.twitter.com/VMxscTaNNr
— Achilles (@Searching4ligh1) April 26, 2025
ఇదిలా ఉండగా.. రజనీకాంత్ సొంత ప్రైవేట్ జెట్ ఉన్నది. దాని విలువ రూ.8కోట్లు. అంతకు ముందు ఆయన 400 సంవత్సరాల పురాతనమైన మాథేశ్వరన్ శివాలయాన్ని దర్శించారు. సంప్రదాయ దుస్తులు ధరించి కారులో వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆలయంలోకి వెళ్లి పూజలు చేశారు. అయితే, జైలర్ మూవీ షూటింగ్‌కు వెళ్లి తిరిగి వస్తున్నట్లుగా సమాచారం. ఆయన చివరిసారిగా అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘వేట్టయన్’ చిత్రంలో నటించారు. ప్రస్తుతం కూలీ మూవీలో నటిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబా మోనికా జాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే, రజనీ నెల్సన్ దిలీప్‌కుమార్ మూవీ ‘జైలర్-2’లోనూ నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సైతం శరవేగంగా సాగుతున్నది.