తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో ఆలయ పండితులు రజనీకాంత్ కుటుంబానికి వేదాశీర్వచనం అందజేశారు. అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందించారు.