Vettaiyan | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) లీడ్ రోల్లో నటించిన చిత్రం వెట్టైయాన్ (Vettaiyan). జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కాగా వెట్టైయాన్ నెలలోపే డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి వచ్చేసింది. ఈ చిత్రం మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇక ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది.
వెట్టైయాన్ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అయింది. వెట్టైయాన్ ప్రస్తుతం అమెజాన్ ప్రైం వీడియోలో తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకేంటి మరి థియేటర్లో మిస్సయిన తలైవా అభిమానులతోపాటు మూవీ లవర్స్ అమెజాన్‌లో సినిమాపై ఓ లుక్కేయండి.
వెట్టైయాన్‌లో దుషారా విజయన్, రితికా సింగ్ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil), మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌పై సుబాస్కరన్ తెరకెక్కించగా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు.
Devara | ఓటీటీలో దేవర సందడి.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే.. ?