కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ (Pa Ranjit) తెరకెక్కించిన తాజా చిత్రం నక్షత్రం నగర్గిరధు (Natchathiram Nagargiradhu). ఇప్పటికే ఈ సినిమా స్పెషల్ షో చూసిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కాశ్యప్(Anurag Kashyap) ప్రశంసలు కురిపించాడు. కాగా తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పా రంజిత్ చేసిన ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
‘నక్షత్రం నగర్గిరధు చూసిన తర్వాత మా సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ ఇచ్చిన ప్రశంసలు నా మనస్సుకు హత్తుకున్నాయి. ఇప్పటివరకు చేసిన డైరెక్షన్, రచన, నటీనటుల సెలక్షన్, కళ, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ పరంగా ఇది మీ ఉత్తమ రచన..అని పేర్కొన్న రజినీకాంత్ సార్‌కు ధన్యవాదాలు‘ అని ట్వీట్ చేశాడు. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రాన్ని యాజి ఫిలిమ్స్, నీలమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి.
ఈ ప్రాజెక్టుకు టెన్మా సంగీతం అందించారు. కాళిదాసు జయరాం, దుషారా విజయన్, హరి కృష్ణన్, వినోథ్ కీలక పాత్రలు పోషించారు. రజినీకాంత్ ప్రస్తుతం 169వ చిత్రం జైలర్ సినిమాలో నటిస్తుండగా..షూటింగ్ దశలో ఉంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ హీరోయిన్గా నటిస్తోంది.
I am extremely touched by the appreciation from our #superstar @rajinikanth sir after watching #NatchathiramNagargiradhu
“This is your best work in terms of direction,writing,casting the performers,art,cinematography,music,so far”are the exact words that he quoted.
Thankyou sir😍— pa.ranjith (@beemji) September 4, 2022
Read Also : Pawan Kalyan | ‘సాహో’ దర్శకుడితో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ?
Read Also : Manchu Manoj | రెండో పెళ్ళికి సిద్ధమైన మంచు మనోజ్.. అమ్మాయి ఎవరో తెలుసా?