Rajinikanth | సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు (డిసెంబర్ 12) సందర్భంగా ఆయన అభిమానులకు భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. రజని కెరీర్లో సంచలనం సృష్టించిన బ్లాక్‌బస్టర్ ‘పడయప్పా’ (తెలుగులో ‘నరసింహ’) ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రీ-రిలీజ్ అవుతోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని రజనీకాంత్ అరుదుగా చేసే పని ఒకటి అందరిని ఆశ్చర్యపరిచింది . నరసింహ సినిమాలోని గెటప్‌లో అరగంటకు పైగా ఇంటర్వ్యూ ఇచ్చారు. రీ-రిలీజ్ కోసం ఇంత పెద్ద ప్రమోషన్ చేయడం రజని కెరీర్లో మొదటిసారి. ఇంటర్వ్యూలో రజనీకాంత్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అందులో ముఖ్యంగా ‘పడయప్పా’ సీక్వెల్ గురించి చేసిన వ్యాఖ్య ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేసింది.
రజని మాట్లాడుతూ .. నరసింహ సీక్వెల్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ‘నీలాంబరి’ అనే టైటిల్‌తో తీసే ఆలోచనలో ఉన్నాం” అని తెలిపారు. అయితే అభిమానుల్లో ఒక్క సందేహం కలిగింది. చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర క్లైమాక్స్‌లో మరణిస్తుంది. మరి సీక్వెల్‌ను ఎలా తీర్చిదిద్దుతారు? ఫ్లాష్‌బ్యాక్ లేదా కొత్త యాంగిల్‌తో వస్తారా? అన్న చర్చ మొదలైంది. నీలాంబరి పాత్ర ఇప్పటికీ కల్ట్. రమ్యకృష్ణ అద్భుత నటన ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇప్పుడు సీక్వెల్ వస్తే ఫ్లాష్‌బ్యాక్ కథనంగా ఉండవచ్చు. లేదా నీలాంబరి పేరుతో పూర్తిగా కొత్త కాన్సెప్ట్ తీసే అవకాశం ఉంది. అయితే అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ కావడం కష్టమన్న అభిప్రాయం కూడా ఉంది.
పడయప్పాను తెరకెక్కించిన దర్శకుడు కెఎస్ రవికుమార్ ఇప్పుడు నటనపైనే దృష్టి పెడుతున్నారు. కాబట్టి సీక్వెల్‌కు వేరే దర్శకుడు రావాల్సిందే. ఇక్కడే ఫ్యాన్స్‌కి డౌట్.. రజని ఈ మాటలు ఫ్యాన్స్ హైప్ కోసం చెప్పారా? లేక నిజంగానే సీక్వెల్ వస్తుందా? ప్రస్తుతం చూస్తే సీక్వెల్ అవకశాలు ఉన్నప్పటికీ కచ్చితంగా చెప్పలేం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే పడయప్పా ఇప్పటిదాకా ఎలాంటి OTTలో కూడా అందుబాటులో లేదు. తమిళ వెర్షన్ ఏ OTTలో లేదు, తెలుగు నరసింహ మాత్రం అందుబాటులో ఉంది. దీంతో రీ-రిలీజ్‌కు అత్యద్భుత రెస్పాన్స్ వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. రజనీకాంత్ సినిమా రంగంలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంలో జరుగుతున్న ఈ రీ-రిలీజ్‌ను ఫ్యాన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. థియేటర్లు ఇప్పటికే స్పెషల్ షోలు ప్లాన్ చేస్తుండగా, భారీ కట్-అవుట్స్, ఫ్యాన్స్ ర్యాలీలు, సోషల్ మీడియా క్యాంపెయిన్లు మొదలైపోయాయి.