Jailer 2 | సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) క్రేజీ లైనప్‌లో ఒకటి జైలర్ సీక్వెల్ జైలర్ 2 (Jailer 2). కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో తలైవా టైటిల్ రోల్లో నటిస్తున్నాడని తెలిసిందే. సీక్వెల్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఇప్పుడు మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది.
జైలర్ 2లో ముత్తువేల్ పాండ్యన్ (తలైవా పాత్ర పేరు) మరింత పవర్ ఫుల్ రోల్లో చూపించబోతున్నాడట. నెల్సన్ దిలీప్ కుమార్ మైండ్ బ్లోయింగ్ స్క్రీన్ ప్లే ఐడియా ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయనుందని ఇన్సైడ్ టాక్. ఫస్ట్ పార్ట్ ముత్తువేల్ పాండ్యన్ పదవీ విరమణకు ముందు జీవితాన్ని చూపించే ప్రీక్వెల్‌గా ఉండనుండగా.. సెకండాఫ్ పూర్తి స్థాయి సీక్వెల్‌గా రానుందట. జైలర్ 2లో పాపులర్ డైరైక్టర్ కమ్ యాక్టర్ ఎస్ జే సూర్య విలన్‌గా కనిపించబోతున్నాడని సమాచారం.
గెస్ట్ అప్పీరియన్స్ రోల్స్‌లో మోహన్ లాల్, విజయ్ సేతుపతి, శివరాజ్ కుమార్ కనిపించనున్నారని టాక్. ఫస్ట్ పార్టులో విలన్‌గా కనిపించి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన వినాయకన్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కనిపించనున్నాడట. ఇక అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మాస్ ఫీస్ట్‌లా జైలర్ 2 ఉండబోతుందన్న వార్తలు ఇప్పుడు అభిమానులు, మూవీ లవర్స్‌లో జోష్ నింపుతున్నాయి. తాజా టాక్ ప్రకారం సెప్టెంబర్ 4 నుంచి జైలర్ 2 వేట మొదలు కానుంది.
#Jailer2 is all set to bring back Muthuvel Pandian in a massive way
The biggest surprise is #Nelson’s mind-blowing screenplay idea
The first half reportedly works as a prequel showing Muthuvel Pandian before retirement, while the second half continues as a full-fledged sequel…
— CHITRAMBHALARE (@chitrambhalareI) May 16, 2026