ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్ మనవడు శ్యామ్ సెల్వన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘నిమ్మకూరు మాస్టారు’. అముదేశ్వర్ దర్శకుడు. జె.ఎం.ప్రదీప్‌రెడ్డి నిర్మాత. రాజేంద్రప్రసాద్ టైటిల్‌రోల్ పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ క్లాప్ ఇచ్చి, చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ఈ నెల 25 నుంచి చిత్రీకరణ మొదలుకానుందని దర్శకుడు తెలిపారు. రాజేంద్రప్రసాద్‌తో తెర పంచుకుంటున్నందుకు ఉద్వేగంగా ఉందని హీరో శ్యామ్ సెల్వన్ చెప్పారు.