Rajamouli SS | రోడ్ ట్రిప్‌లో 2-3 కిలోలు బరువు పెరిగిన రాజమౌళి.. జక్కన్న టూర్ విశేషాలివే
Rajamouli SS | ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli SS) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. రికార్డులు, కలెక్షన్లు, అవార్డుల గురించే మాట్లాడుకుంటుంటారు సినీ జనాలు. ఇక ఎప్పుడూ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉండే జక్కన్నకు ఇప్పటికీ తీరిక దొరికింది. ఈ స్టార్ డైరెక్టర్ తనకిష్టమైన రోడ్ ట్రిప్‌కు టైం కేటాయించాడు.
Rajamouli SS | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో ఒకరు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli SS). బాహుబలి ప్రాంఛైజీ, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత జక్కన్నకు దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ స్టార్ సెలబ్రిటీ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. రికార్డులు, కలెక్షన్లు, అవార్డుల గురించే మాట్లాడుకుంటుంటారు సినీ జనాలు.
జక్కన్న సినిమా ప్రకటించాడంటే చాలు తనకు కావాల్సిన అవుట్ పుట్ వచ్చేంత వరకు కావాల్సినంత టైం తీసుకుంటాడని తెలిసిందే. కాస్త లేటైనా ఫర్వాలేదు.. బాక్సాఫీస్‌ను షేక్ చేయాల్సిందే అన్నట్టుగా.. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్టు దిగిందా.. లేదా..? అనే డైలాగ్‌ను గుర్తు చేస్తుంటాడు జక్కన్న. ఇక ఎప్పుడూ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉండే జక్కన్నకు ఇప్పటికీ తీరిక దొరికింది. ఈ స్టార్ డైరెక్టర్ తనకిష్టమైన రోడ్ ట్రిప్‌కు టైం కేటాయించాడు. ఇంతకీ ఏ దేశానికి వెళ్లాడో అనుకుంటున్నారా..? జక్కన్న టూర్ ప్లాన్ చేసుకుంది ఎక్కడో కాదు. ఇండియాలోనే. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నాడు.
నా కూతురికి ధన్యవాదాలు..
సెంట్రల్ తమిళనాడులో రోడ్ ట్రిప్ (Road Trip) వేయాలని చాలా కాలంగా అనుకున్నా. ఆలయాలను సందర్శించాలనుకున్న నా కూతురికి ధన్యవాదాలు. మొత్తానికి మేము ఆ ట్రిప్‌ను ప్రారంభించాము. జూన్ చివరి వారంలో శ్రీరంగం, దారాసురం, బృహదీశ్వర కోయిల్, రామేశ్వరం, కణాదుకథాన్, తూత్తుకుడి, మధురైకి వెళ్ళాను. నాకిచ్చిన కొన్ని రోజుల్లో మంచుకొండ యొక్క అంచును మాత్రమే తాకొచ్చు. ఈ అందమైన చారిత్రక ప్రదేశాల్లో అద్భుతమైన వాస్తుశిల్పం, అద్భుతమైన ఇంజనీరింగ్, పాండ్యులు, చోళ నాయకులతోపాటు ఇతర పాలకుల లోతైన ఆధ్యాత్మిక ఆలోచనలు నిజంగా మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి.
మంత్రకూడం, కుంభకోణంలో చక్కటి భోజనం చేసినా.. రామేశ్వరంలోని కాకా హోటల్ మురుగన్ మెస్‌లో భోజనం చేసినా అన్ని చోట్లా ఆహారం అద్భుతంగా ఉంటుంది. నేను వారంలో 2-3 కిలోలు పెరిగాను. 3 నెలల విదేశీ ప్రయాణం, ఆహారం తర్వాత ఈ హోమ్ ల్యాండ్ టూర్ చాలా రిఫ్రెష్‌గా, ఉత్సాహంగా ఉంది..అంటూ ట్వీట్ చేశాడు జక్కన్న. సతీమణి, కూతురు, ఇతర కుటుంబసభ్యులతో టూర్‌కు సంబంధించిన విజువల్స్ వీడియోను షేర్ చేశాడీ స్టార్ డైరెక్టర్. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
జక్కన్న టూర్ సాగిందిలా..
Wanted to do a road trip in central Tamilnadu for a long time. Thanks to my daughter who wanted to visit temples, we embarked upon it. Had been to Srirangam, Darasuram, Brihadeeswarar koil, Rameshwaram, Kanadukathan, Thoothukudi and Madurai in the last week of June . Could only… pic.twitter.com/rW52uVJGk2
— rajamouli ss (@ssrajamouli) July 11, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

