మహేష్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న జంగిల్ అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్ నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. లార్జర్ దేన్ లైఫ్ కథాంశాలతో వెండితెరపై మ్యాజిక్ చేస్తుంటారు రాజమౌళి. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథేమిటన్నది అందరిలో ఆసక్తిని పెంచుతున్నది. అమెజాన్ అడవుల నేపథ్యంలో ట్రెజర్ హంట్ కథాంశమిదని గతంలో వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ కథలో కాశీ నేపథ్యం కీలకంగా ఉంటుందని తెలిసింది.
భారతీయ పురాణాలతో సంబంధం కలిగిన అడ్వెంచరస్ జర్నీగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. హనుమంతుడి స్ఫూర్తితో కథానాయకుడి పాత్రను తీర్చిదిద్దారని ప్రచారం జరుగుతున్నది. కాశీ నేపథ్య సన్నివేశాల కోసం హైదరాబాద్‌లో కాశీ పట్టణాన్ని తలపించేలా సెట్స్ నిర్మాణం జరుగుతున్నదని తెలుస్తున్నది. మైథాలజీ, హిస్టరీలతో కూడిన అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రాజమౌళి ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఒడిశాలోని కోరాపుట్ పర్వతపంక్తుల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘గరుడ’ అనే టైటిల్ ప్రచారంలోఉంది.