ఈ శుక్రవారం కూడా పాయే.. మూడు సినిమాల్లో ఏది బెటర్..

Box office | శుక్రవారం.. కొత్త సినిమాలు ఈ రెండు పదాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లకు కొత్త సినిమాలు క్యూ కడుతుంటాయి. అయితే వచ్చిన ప్రతి సినిమా ఆకట్టుకోవాలని రూల్ లేదు. అలాగని ప్రతి సినిమా నిరాశ పరుస్తుందని రూల్ కూడా లేదు. ఈ మధ్య వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలం అవుతున్నాయి. గత కొన్ని వారాలుగా విడుదలవుతున్న సినిమాలు ఏవి బాక్సాఫీస్ దగ్గర నిలబడటం లేదు. మరీ ముఖ్యంగా దీపావళికి విడుదలైన మూడు సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. దీపావళి తర్వాత నవంబర్ 12న విడుదలైన రెండు తెలుగు సినిమాలకు కూడా ఊహించిన టాక్ రాలేదు.
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన పుష్పక విమానం సినిమా సోసో టాక్ తో మొదలైంది. ముఖ్యంగా ట్రైలర్ కట్ చేసిన విధానం.. సినిమాలో ఉన్న కథ.. రెండు వేరు వేరు ఉండటంతో డిస్ కనెక్ట్ అయ్యామని పెదవి విరుస్తున్నారు ప్రేక్షకులు. ఫ్యామిలీ డ్రామా అని చూపించి థియేటర్ లోపలికి వెళ్లిన తర్వాత మర్డర్ మిస్టరీ క్రైమ్ డ్రామాగా ఉండటం సినిమాకు అంతగా కలిసి రాలేదని ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.
మరోవైపు కార్తికేయ హీరోగా నటించిన రాజా విక్రమార్క సినిమా మంచి అంచనాలతో విడుదలైంది. పైగా ఈ సినిమా ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్నింటికి మించి చిరంజీవి సినిమా టైటిల్‌తో రావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. వినాయక్ శిష్యుడు శ్రీ సిరిపల్లి తెరకెక్కించిన ఈ సినిమా హాఫ్ మీల్స్ భోజనంలా ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఫస్టాఫ్ వరకు బోర్ కొట్టకుండా తీసిన దర్శకుడు.. సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా గాలికి వదిలేశాడు అంటున్నారు ప్రేక్షకులు. రాజా విక్రమార్క సూపర్ హిట్ కొట్టాలని ఆశతో ఉన్న కార్తికేయకు మరోసారి నిరాశే మిగిలిందని ఈ టాక్ చూస్తుంటే అర్థమవుతుంది. అయితే వీకెండ్ మరో సినిమా లేకపోవడంతో రాజా విక్రమార్క మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక దుల్కర్ సల్మాన్ కురుప్ సినిమా వచ్చినట్టు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియలేదు. ప్రమోషన్స్ లేకపోవడంతో దీని గురించి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సందడి కనిపించలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
pushpaka vimanam | పుష్పక విమానం మూవీ రివ్యూ
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి
RRR : చేతులు లేకున్నా ఎన్టీఆర్, చరణ్ స్టెప్స్‌ను దింపేసింది.. ఆర్ఆర్ఆర్ టీమ్ ఫిదా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

