పుష్పక విమానం మూవీ రివ్యూ

అగ్రహీరో విజయ్ దేవరకొండ సోదరుడిగా చిత్రసీమలోకి అరంగేట్రం చేశారు ఆనంద్ దేవరకొండ. కాన్సెప్ట్ ఓరియెంటెండ్ కథాంశాలతో తెరకెక్కిన ‘దొరసాని’, ‘మిడిల్‌క్లాస్ మెలోడీస్’ చిత్రాలతో హీరోగా ప్రతిభను చాటుకున్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్పక విమానం’. విజయ్ దేవరకొండ సమర్పణలో గోవర్ధన్‌రావు దేవరకొండ, ప్రదీప్ ఎర్రబెల్లి, విజయ్ మట్టపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. సోదరుడు ఆనంద్‌కు మంచి కమర్షియల్ హిట్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ చిత్ర నిర్మాణాన్ని చేపట్టిన విజయ్ దేవరకొండ ఎలాంటి ఫలితం దక్కింది? హీరోగా ఆనంద్ ప్రేక్షకుల్ని మెప్పించాడా?లేదా? అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే…
కథ ఏంటంటే?
చిట్టిలంక సుందర్(ఆనంద్ దేవరకొండ) హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటాడు. మీనాక్షి(గీత్సైని) అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్న అతడు భార్యతో కలిసి నగరానికి వస్తాడు. హైదరాబాద్‌కు వచ్చిన మూడు రోజుల తర్వాత అతడి భార్య కనిపించకుండాపోతుంది. పెళ్లికి ముందే తాను ఒకరిని ప్రేమించినట్లుగా..అతడితో వెళ్లిపోతున్నట్లుగా ఉత్తరం రాస్తుంది. పెళ్లాం లేచిపోయిందని తెలిస్తే తన పరువు పోతుందని భావించిన సుందర్ ఆమె ఇంట్లోనే ఉన్నట్లుగా అందరిని నమ్మిస్తుంటాడు. తాను పనిచేసే స్కూల్లోని సహ ఉపాధ్యాయులందరూ మీనాక్షిని చూడటానికి సుందర్ ఇంటికి వస్తారు. వారికి తన భార్యగా షార్ట్ ఫిలిమ్స్‌లో నటించే రేఖను(శాన్వీ మేఘన) పరిచయం చేస్తాడు. అనూహ్యంగా మీనాక్షి హత్యకు గురవుతుంది. ఈ కేసును ఎస్ఐరంగం(సునీల్) చేపడతాడు. అతడి పరిశోధనలో సుందర్ ఇంట్లోనే మీనాక్షి చనిపోయినట్లుగా తేలుతుంది. సుందర్ ఈ హత్య చేసినట్లుగా అనుమానించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేస్తారు? ఈ కేసు నుంచి అతడు ఎలా బయటపడ్డాడు?అసలు మీనాక్షిని ఎవరూ హత్యచేశారు?సుందర్ ప్రేమను మీనాక్షి అర్థంచేసుకుందా?లేదా?అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. చదవండి : కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి
సినిమా ఎలా ఉంది?
వినోదాత్మక కథాంశంతో తెరకెక్కిన మర్డర్ మిస్టరీ చిత్రమిది. సాధారణంగా మర్డర్ మిస్టరీ సినిమాలు చాలా వరకు పోలీసుల ఇన్వేస్టిగేషన్స్, హంతకుల్ని పట్టుకోవడానికి హీరో చేసే భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో సీరియస్‌గా సాగుతుంటాయి. కానీ దర్శకుడు మాత్రం ఆ పంథాకు భిన్నంగా కామెడీని ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కించారు. హీరోకు ఎదురయ్యే సంఘర్షణ నుంచి వినోదాన్ని రాబట్టుకుంటూ ప్రేక్షకుల్ని మెప్పించాలని ప్రయత్నించారు. కామెడీ డోసు తగ్గకుండా చూసుకుంటేనే మరోవైపు హంతకుడు ఎవరనే సస్సెన్స్‌ను చివరి వరకు ప్రేక్షకులకు ఊహలకు అందకుండా నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు.
పెళ్లిఘట్టాన్ని అందంగా చూపిస్తూ సిద్‌శ్రీరామ్ పాటతో ఆహ్లాదభరితంగా సినిమాను మొదలుపెట్టారు దర్శకుడు. మీనాక్షి కనిపించకుండా పోవడం, ఆమె లేచిపోయిందని నిజాన్ని దాచిపెట్టడానికి సుందర్ పడే ఇబ్బందులతో ప్రథమార్థం సరదాగా సాగుతుంది. అబద్దాలు చెబుతూ కొలిగ్సి దగ్గర సుందర్ దొరికే సన్నివేశాలతో పాటు షార్ట్ఫిలిమ్స్ యాక్టర్‌ను తన భార్యగా వారికి పరిచయం చేసే ఎపిసోడ్స్ థియేటర్స్‌లో నవ్వులను పండించాయి. మీనాక్షి హత్యకు గురవ్వడంతో ఆ నేరంలో సుందర్‌ను ప్రధాన అనుమానితుడిగా పోలీసులు అరెస్ట్ చేసే సన్నివేశంలో కథను మర్డర్ మిస్టరీవైపు మలుపుతిరుగుతుంది. హత్య వెనకున్న ఒక్కో చిక్కుముడిని విప్పుతూ హీరో వెళ్లే సన్నివేశాల ద్వితీయార్థాన్ని వినోదం, ఎమోషన్స్ కలబోతగా అల్లుకున్నారు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సర్ధుకుపోయిజీవించినప్పుడు వైవాహిక బంధం నిలబడుతుందనే సందేశాన్ని పతాక ఘట్టాల్లో ఇచ్చారు.
కమర్షియల్ పంథాకు భిన్నంగా కథాబలమున్న చిత్రాలతో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు ఆనంద్ దేవరకొండ. ఈ సినిమాలోనూ సమాజం పట్ల భయాలు, కుటుంబం, భార్య పట్ల అమితమైన ప్రేమ ఉన్న సగటు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వైవిధ్యమైన నటనను కనబరిచారు. గత సినిమాలతో పోలిస్తే కామెడీ టైమింగ్, ఎమోషన్స్ పరంగా మెప్పించారు. డైలాగ్ డెలివరీ చాలా వరకు మెరుగయ్యింది. కథానాయికల్లో శాన్వీమేఘనకు మంచి మార్కులు పడ్డాయి. హీరోకు సహాయం చేయడానికి వచ్చి తానే సమస్యల్లో చిక్కుకునే యువతిగా ఆమె పాత్ర ఆద్యంతం నవ్విస్తుంది. గీత్సైని అందంగా కనిపించింది. అభినయాన్ని ప్రదర్శించడానికి ఆమెకు పెద్దగా అవకాశం రాలేదు. సునీల్, సీనియర్ నరేష్, గిరిధర్‌లు తమ కామెడీతో ఆకట్టుకున్నారు.
పర్ఫామెన్స్
దర్శకుడిగా దామోదరకు ఇదే తొలి సినిమా. రొటీన్ కథను ఎంచుకున్న అతడు కథనాన్ని, పాత్రల్ని మాత్రం కొత్తగా ఆవిష్కరించడంలో విజయవంతం అయ్యారు. పతాక ఘట్టాలు ఊహాతీతంగా ఉండటం మైనస్‌గా మారింది. పోలీస్ ఇంటరాగేషన్ పేరుతో సునీల్ చేసే హడావిడిలో కామెడీ వర్కవుట్ అయినా ఆ సన్నివేశాలన్నీ సినిమా నిడివి పెంచడానికి ఉపయోగపడ్డాయి.
సినిమాలోని ఒక్కో పాటను ఒక్కో సంగీతదర్శకుడు కంపోజ్ చేయడం వల్ల కొత్తదనం కనిపించింది. సిలకా, కల్యాణం పాటలు బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పిస్తాయి. ఎక్కడ ఓ చిన్న సినిమా అనుభూతి కలిగదు.
విభిన్నమైన మర్డర్ మిస్టరీ ఎంటర్టైనర్ చిత్రమిది. థ్రిల్లర్ సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకులతో పాటు కామెడీ చిత్రాల్ని చూసేవారిని మెప్పిస్తుంది.
రేటింగ్-2.75
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- CInema
- Review
- telugu cinema
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

