Bhale Unnade | ఒక వైపు లావణ్య వివాదంతో సతమవుతునే మరోవైపు తన సినిమాలను చక చక పూర్తి చేస్తున్నాడు టాలీవుడ్ యువ నటుడు రాజ్ తరుణ్. ఇప్పటికే ‘పురుషోత్తముడు’, తిరగబడరసామి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కుర్ర హీరో మరో సినిమాను విడుదలకు రెడీ చేశాడు.
రాజ్‌తరుణ్ కథానాయకుడిగా జె.శివసాయివర్ధన్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘భలే ఉన్నాడే!’. ఈ సినిమాలో మనీషా కంద్కూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. మారుతి టీమ్ ప్రొడక్ట్ సంస్థ సమర్పిస్తోంది. ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మాత.
ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 07న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ‘పురుషోత్తముడు’, తిరగబడరాసామి వచ్చి రెండు నెలలు కూడా అవ్వట్లేదు అంతలోనే మరో సినిమాను విడుదలకు రెడీ చేశాడు రాజ్ తరుణ్. ఇక ఈ సినిమాతోనైనా రాజ్ హిట్ కొడతాడేమో చూడాలి. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ టైలర్ పాత్రలో నటిస్తుండగా.. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Raj Tarun’s #BhaleUnnade coming to theatres on Saturday, 07th September. pic.twitter.com/MGZl5lBAmY
— Aakashavaani (@TheAakashavaani) August 15, 2024
Also Read..