TMC MP : మహిళా సాధికారత గురించి మనం మాట్లాడుతున్న సందర్భంలో దేశంలో కేవలం ఒకే ఒక్క మహిళా సీఎం ఉన్నారని టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా అన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విషయం ఉన్న మహిళని ప్రశంసించారు. ఇంతటి ఉన్నత స్ధానానికి చేరుకునేందుకు ఆమె ఎంతగానో శ్రమించారని, జీవితమంతా పోరాడారని కొనియాడారు.
విజయవంతమైన నేతగా ఆమె తనను తాను నిరూపించుకున్నారని అన్నారు. ఆమెను చూసి దేశమంతా గర్విస్తున్నదని చెప్పారు. కాషాయ పాలకులు ఈ విషయం జీర్ణించుకోలేకపోతున్నారని, దీదీకి ఉన్న ఆదరణను చూసి తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. దీదీ లక్ష్యంగా బీజేపీ నేతలు నిత్యం విమర్శల దాడికి పదును పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాషాయ నేతలు ఆమెను నేరుగా నిందిస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కోల్కతా వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపుతోంది. ఈ ఘటన సభ్యసమాజానికి సిగ్గుచేటని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ గురువారం ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిని సందర్శించి ఆందోళన చేపట్టిన డాక్టర్లు, విద్యార్ధులతో ముచ్చటించారు. మీకు న్యాయం జరుగుతుంది..మీ ఆవేదనను విని అర్ధం చేసుకునేందుకు తాను స్వయంగా ఇక్కడకు వచ్చానని ఈ సందర్భంగా గవర్నర్ ఆనంద బోస్ భరోసా ఇచ్చారు.
Read More :
Independence Day | స్వాతంత్య్ర దినోత్సవం.. పూరీ తీరంలో ఆకట్టుకుంటున్న సైకత శిల్పం