మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Oct 01, 2020 , 03:09:54

కడుపుబ్బా నవ్విస్తుంది

కడుపుబ్బా నవ్విస్తుంది

రాజ్‌తరుణ్‌, మాళవికానాయర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మించారు. విజయ్‌కుమార్‌కొండా దర్శకుడు. ఈ నెల 2న ఈ చిత్రం విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక జరిగింది. రాజ్‌తరుణ్‌ మాట్లాడుతూ ‘కుటుంబ విలువలతో తెరకెక్కిన వినోదాత్మక చిత్రమిది. ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్విస్తుంది. నా కెరీర్‌లో ఎక్కువ డ్యాన్స్‌లు ఈ సినిమాలోనే చేశా. కథానాయికగా మాళవికను కొత్త కోణంలో చూస్తారు’ అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఆరు నెలల తర్వాత సినిమా వేడుకను జరుపుకోవడం ఆనందంగా ఉంది. వినూత్నమైన  కథకు ప్రతిభావంతులైన చక్కటి టీమ్‌ కుదిరింది.  అందరం కష్టపడి మంచి సినిమా చేశాం’ అని చెప్పారు. నిజాయితీగా తాము చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముందని దర్శకుడు పేర్కొన్నారు. అక్టోబర్‌ 1న సాయంత్రం ఆరు గంటలకు ఈ సినిమా విడుదలవుతుందని ‘ఆహా’ సీఈవో అజిత్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి, హేభాపటేల్‌, శేఖర్‌మాస్టర్‌ పాల్గొన్నారు. logo