 
                                                            ‘నేను కాలేజీలో చూసిన ఓ సంఘటన ఆధారంగా ఈ కథ రాసుకున్నా. అప్పట్లో వచ్చిన ఓ పాట కూడా కథ విషయంలో స్ఫూర్తినిచ్చింది. రష్మిక మందన్న ఈ కథ విని బాగా ఎక్సైట్ అయింది. ‘ఓ అమ్మాయిగా ఈ స్టోరీకి నేను బాగా కనెక్ట్ అయ్యాను. అందరికి చెప్పాల్సిన కథ ఇది’ అంటూ నన్ను ప్రోత్సహించింది’ అని అన్నారు నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్. ఆయన నిర్ధేశకత్వంలో రష్మిక మందన్న, దీక్షిత్‌శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమకథా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం రాహుల్ రవీంద్రన్ విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు.
 
                            