Rage Of Kaantha | మల్టీ టాలెంటెడ్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కాంపౌండ్ నుంచి వస్తోన్న ప్రాజెక్ట్ కాంత. సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్లో పీరియడ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్, టీజర్లకు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని నవంబర్ 14న సోలోగా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్ కూడా షేర్ చేశారు.
తాజాగా ఈ మూవీ నుంచి రేజ్ ఆఫ్ కాంత (Rage Of Kaantha) ట్రాక్‌ను లాంచ్ చేశారు మేకర్స్. జాను చెంతర్ కంపోజ్ చేసిన ఈ పాటను సిద్ధార్థ్ బస్రూర్ పాడాడు. ర్యాప్ స్టైల్లో సాగుతున్న ఈ ట్రాక్ పాత్రలోని డిఫరెంట్ షేడ్స్‌ను చూపిస్తూ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తుంది.
ఇటీవలే ఈ మూవీ నుంచి అమ్మాడివే సాంగ్‌ను విడుదల చేయగా.. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే కాంబోలో వచ్చే ఈ మెలోడీ ట్రాక్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది.
భారతీయ సినిమాలో 1960ల నాటి గత యుగానికి నివాళిగా రాబోతున్న కాంత సినిమాకు దుల్కర్ సల్మాన్‌తోపాటు టాలీవుడ్ యాక్టర్ రానా దగ్గుబాటి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు.
Rage Of Kaantha ట్రాక్..
Ravi Teja | క్రేజీ టాక్.. చిరంజీవి డైరెక్టర్‌ను లైన్లో పెట్టిన రవితేజ.. !
Narvini Dery | అతను అలాంటి వాడే..! తమిళ నటుడు అజ్మల్‌పై సంచలన ఆరోపణలు చేసిన నటి..!