Radhika Apte | బాలీవుడ్ చిత్రసీమలో పనిచేసే మహిళలు సమాన హక్కులు, వేతనాలు, గుర్తింపు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని చెప్పింది కథానాయిక రాధికా ఆప్టే. మహిళా ప్రధాన చిత్రాల రూపకల్పన ఎక్కువ కావడంతో నాయికలకు హీరోలతో సమానమైన ప్రాధాన్యత దక్కుతున్నదని ఆనందం వ్యక్తం చేసింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మిస్ట్రెస్ అండర్కవర్’ చిత్రం త్వరలో ఓటీటీ వేదికలో విడుదలకానుంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ప్రస్తుతం ప్రపంచం మొత్తం మారిపోతున్నది. అన్ని రంగాల్లో సమానత్వాన్ని కోరుకుంటున్నారు. సమాజానికి ప్రతిబింబం లాంటి సినిమాల్లో కూడా సమానత్వాన్ని పాటించాలి’ అని పేర్కొంది. ‘మిస్ట్రెస్ అండర్కవర్’ చిత్రాన్ని కామెడీ ప్రధానంగా తెరకెక్కించారు. ఇందులో రాధికా ఆప్టే గూఢచారి పాత్రలో కనిపించనుంది. పదేళ్ల తర్వాత గూఢచారిగా విధుల్లో చేరిన దుర్గ అనే వివాహిత మహిళ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల్ని హాస్యప్రధానంగా ఈ సినిమాలో ఆవిష్కరించారు.