పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న చిత్రం రాధేశ్యామ్ (Radhe Shyam) . రాధాకృష్ణకుమార్ (Radha Krishna Kumar) దర్శకత్వంలో యూనివర్సల్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. అయితే రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ జనవరి 12న వస్తుందని, ఈ నేపథ్యంలో రాధేశ్యామ్ విడుదల వాయిదా వేస్తున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో రాధేశ్యామ్ నిర్మాతలు ఆ పుకార్లకు చెక్ పెడుతూ సినిమా అనుకున్న సమయానికి ప్రపంచవ్యాప్తంగా జనవరి 14న విడుదల కాబోతుందిన ప్రకటించారు.
సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. రాధేశ్యామ్ లో ప్రభాస్ కు జోడీగా పూజాహెగ్డే (Pooja Hegde)నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ కు అద్బుతమైన స్పందన వచ్చింది. యూవీ క్రియేషన్స్ , టీ సిరీస్ బ్యానర్ల పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద రాధేశ్యామ్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్ మరోవైపు కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చేస్తున్నాడు.
దీంతోపాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ తో కలిసి ఆదిపురుష్ లో నటిస్తున్నాడు. నాగ్ అశ్విన్ తో కలిసి ప్రాజెక్టు కే చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
Chiranjeevi | క్రేజీ వార్త..చిరంజీవి సినిమాలో రవితేజ..?
వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్
పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించనని చిరంజీవి అన్నారు: పేర్ని నాని