ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) డైరెక్షన్ లో వస్తున్న చిత్రం పక్కా కమర్షియల్ (Pakka Commercial). ఈ ప్రాజెక్టులో గోపీచంద్ (Gopichand ) హీరోగా నటిస్తోండగా..రాశీఖన్నా (Raashi Khanna) ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది. తాజాగా ఈ మూవీ సెట్స్ లో నుంచి విడుదలైన స్టిల్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. లొకేషన్ లో డైరెక్టర్ మారుతి హీరోయిన్ రాశీఖన్నాకు దీవెనలు అందించాడు. రాశీఖన్నా సంప్రదాయబద్దంగా శారీ లుక్ లో రెండు చేతులు జోడించి నమస్కారం పెడుతుంటే..ఎదురుగా ఉన్న మారుతి సుఖీభవ అన్నట్టుగా ఆశీస్సులు అందించాడు.
అయితే సినిమాలో వచ్చే సీన్ కోసం వీరిద్దరూ ఇలా చేశారా..? లేదా లొకేషన్ లో ఫన్నీగా ఉండేందుకు ఇలా చేశారా..? అన్నది తెలియాల్సి ఉంది. పక్కా కమర్షియల్ సెట్స్ లో డైరెక్టర్, హీరోయిన్ ఫన్నీ స్టిల్ ఇపుడు సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. మరోవైపు సెట్స్ లో సత్యరాజ్ కూడా ఉండటం చూడొచ్చు.
గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై ఎస్కేఎన్, బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పక్కాకమర్షియల్ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ డైరెక్టర్. మారుతి-గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా ఇది. రాశీఖన్నాతో ఇప్పటికే ప్రతీ రోజూ పండగే సినిమా చేశాడు మారుతి.
Maruthi sir blessing me with his wit!
— Raashii Khanna (@RaashiiKhanna_) August 19, 2021
🤣🤣
Coming to you with one more hilarious character after Angel Aarna! @DirectorMaruthi #onset #pakkacommercial pic.twitter.com/iS1G9w7ctS
ఇవికూడా చదవండి..
Regina Cassandra| అస్థిపంజరాన్ని పరీక్షిస్తున్న రెజీనా
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!