Game Changer | రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం గేమ్‌ఛేంజర్ (Game Changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు సుందరి అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ రా మచ్చా మచ్చా ప్రోమో నెట్టింట వైరల్ అవుతుండగా.. తాజాగా లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.
రాంచరణ్ స్టైలిష్ డ్యాన్స్‌తో అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నట్టు విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. ఎస్ థమన్ చెప్పినట్టుగా ఈ సాంగ్‌తో రాంచరణ్ అభిమానులను థ్రిల్ చేయడం పక్కా అని తెలిసిపోతుంది.
గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే విడుదల చేసిన జరగండి జరగండి సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని 2024 డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సందడి చేయనున్న గేమ్ ఛేంజర్‌లో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కథానుగుణంగా రాంచరణ్ తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్.
ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. గేమ్ ఛేంజర్‌కు పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
రా మచ్చా మచ్చా లిరికల్ వీడియో సాంగ్..
Bhaagamathie 2 | భాగమతి మళ్లీ వచ్చేస్తుంది.. అనుష్క భాగమతి 2పై డైరెక్టర్ అశోక్ క్లారిటీ
Bipasha Basu | బిపాషా బసు బాయ్ ఫ్రెండ్ కోసం శాఖాహారిగా మారిందట..!