Madhavan | ప్రస్తుతం దేశమంతటా కూడా వరదలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలతో రోడ్లు నదుల్లా మారాయి. సామాన్య ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. ఇక షూటింగ్ కోసం జమ్మూ కాశ్మీర్‌లోని లేహ్ ప్రాంతానికి వెళ్లిన మాధవన్ వర్షాల వలన అక్కడే ఇరుక్కుపోయాడు. ఎడతెరిపిలేని వర్షాల వలన విమానాలు రద్ధు కావడం జరిగింది.దాంతో తాను అక్కడే ఉండిపోవల్సి వచ్చిందని మాధవన్ అన్నారు. అలానే తన హోటల్ గది కిటికీ నుండి మంచుతో కప్పబడిన అందమైన ప్రకృతిని చూపిస్తూ పరిస్థితిని తెలియజేశారు. 2008లో కూడా త్రీ ఇడియట్స్ షూటింగ్ కోసం లడఖ్‌కి వెళ్లినప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను అని గుర్తు చేసుకున్నారు.
లేహ్( లఢక్ రాజధాని) లో పరిస్థితి గురించి కూడా వివరించారు. షూటింగ్ కోసం ఈ ప్రాంతానికి వచ్చినప్పటి నుండే మంచు విపరీతంగా కురుస్తుంది. నాలుగు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాల వలన విమానాశ్రాయాలు రద్ధు అయ్యాయి. ఈ క్రమంలో నేను లేహ్‌లో చిక్కుకుపోయాను. లఢఖ్ వచ్చిన ప్రతిసారి కూడా ఇలానే జరుగుతుంది. ఈ రోజైన వర్షం తగ్గాలని విమానాల రాకపోకలు సాగి నేను ఇంటికి చేరుకోవాలని ఆశిస్తున్నాను అని మాధవన్ ఆశాభావం వ్యక్తం చేసారు.
ప్రముఖ నటుడు ఆర్ మాధవన్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఎన్నో గొప్ప చిత్రాల్లో తన నటనతో ఆయన జనాల్ని మెప్పించిన ఆయన ఇప్పటికీ తన నటనతో పాటు లుక్స్ పరంగా కూడా పాపులారిటీ సాధించారు. 55 ఏళ్ల వయసులో కూడా ఆయన స్కిన్ టోన్ యువకులను పోలినట్టు ఉండడంతో చాలా మంది కూడా ఆయన సీక్రెట్ ఏంటా అని ముచ్చటించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల మాధవన్ తన గ్లామర్ సీక్రెట్ కూడా తెలియజేశారు.