Pushpa The Rule | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప-2’ ది రూల్. ఈ సక్సెస్ఫుల్ కాంబినేషనలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన పుష్ప-2 ది రైజ్‌కు సీక్వెల్ ఇది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు నెలకొని వున్నాయి. డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా, ఫాహెద్ ఫాజిల్, సునీల్ ముఖ్యపాత్రలో కనిపిస్తారు. యలమంచిలి రవి, నవీన్ ఎర్నేనీ నిర్మిస్తున్న ఈ చిత్రం అత్యధిక బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాతక్మంగా తెరకెక్కుతోంది.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన సెట్లో జరుగుతోంది. ఇటీవల విహార యాత్రకు విదేశాలకు వెళ్లి వచ్చిన కథానాయకుడు అల్లు అర్జున్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఇదిలా వుండగా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పుష్ప పుష్ప పుష్పరాజ్ అనే టైటిల్ సాంగ్‌తో పాటు కపుల్ సాంగ్ చూసేకి అగ్గిరవ్వ మాదిరిగా వున్నాడే నా పుష్ప పాటలకు అనూహ్యమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు పాటలు కూడా సూపర్‌హిట్ పాటలుగా నిలిచాయి. ముఖ్యంగా ఈ పాటలు యూట్యూబ్‌లో చాలా రోజులు ట్రెండింగ్‌లో వున్నాయి. అయితే తాజాగా పుష్ప టైటిల్ సాంగ్‌కు 150 మిలియన్స్ వ్యూస్‌ను సాధించింది. దీనికి సంబంధించిన అప్డేట్ను అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. దేవిశ్రీప్రసాద్ తన స్వరాలతో మ్యాజిక్ చేస్తూ పుష్ప-2 పాటలతో ఆకట్టుకున్నాడు. త్వరలో మూడో లిరికల్ అప్డేట్ కూడా రాబోతుందని తెలిసింది. సో..పుష్ప-2 సాంగ్..యూట్యూబ్‌ను రూల్ చేస్తుంది..! ఇక ఈ చిత్రంలో ఐటెంసాంగ్ కూడా ఓ రేంజ్లో వుండబోతుందట.
Also Read..
YS Sharmila | అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.. కేంద్రమంత్రి పెమ్మసానితో షర్మిల ట్విట్టర్ వార్!
Sadhna Saxena | ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డీజీగా తొలిసారి ఒక మహిళా అధికారి నియామకం