క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప. ఈ చిత్రం ఆగస్ట్ 13న విడుదల కానుందని గతంలో ప్రకటించారు. కరోనా వలన పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం తిరిగి షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గా ఈ చిత్రం నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్
దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సింగిల్ ట్యూన్ ఆగస్ట్ 13న విడుదల కానున్నట్టు తెలియజేశారు. ఇక కొద్ది సేపటి క్రితం పుష్ప తొలలఇ పార్ట్‌ని డిసెంబర్లో విడుదల చేయనున్నట్టు పేర్కోన్నారు. దీంతో బన్నీ అభిమానులు ఇక తగ్గేదేలే అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు. ఐదు భాషలలో ఈ చిత్రం విడుదల కానుండగా, ఇందులో బన్నీ పుష్పరాజ్ పాత్రలో కనిపించి సందడి చేయనున్నారు.
పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్నా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు వైరల్‌గా మారింది. అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌గా నిలిచింది.