Pushpa 3 The Rampage | పాన్ ఇండియా మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేసిన తెలుగు ప్రాజెక్టుల్లో టాప్‌లో ఉంటుంది అల్లు అర్జున్ నటించిన పుష్ప (Pushpa). ఈ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ టైటిల్ రోల్లో ప్రాంఛైజీగా వస్తోండగా.. ఇప్పటికే పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. తాజాగా పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇదిలా ఉంటే సీక్వెల్ విడుదలకు ముందే పుష్ప 3పై ఇప్పటికే నెట్టింట వార్తలు రౌండప్ చేస్తున్న విషయం తెలిసిందే. మీరు మీ హీరోను నాకోసం ఇంకో మూడేళ్లు ఇవ్వగలిగే అవకాశముందా..? అని అడగండి. ఉందంటే ఆ తర్వాత పుష్ప 3 చేస్తానంటూ ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కామెంట్స్ చేశాడు సుకుమార్.
ఇదిలా ఉంటే ఎవరూ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది బన్నీ టీం. త్రీక్వెల్ పుష్ప 3 ది ర్యాంపేజ్ (Pushpa 3 The Rampage) టైటిల్‌తో రాబోతుంది. మ్యూజిక్ సిట్టింగ్స్ స్టూడియోలో సుకుమార్ టీం బ్యాక్ డ్రాప్లో స్క్రీన్‌పై టైటిల్ లుక్ ఉన్న ఫొటోను షేర్ చేశారు. సీక్వెల్ ఎండింగ్లో పుష్ప 3 టీజర్ కూడా ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. ఇంకేంటి మరి మూవీ లవర్స్‌లో పుష్ప రాజ్ మేనియా మరికొన్నేళ్లపాటు పదిలంగా ఉండబోతున్నట్టు తాజా అప్డేట్ క్లారిటీ ఇచ్చేస్తుంది.
It’s OFFICIALLY CONFIRMED#Pushpa3TheRampage ✅🔥🪓
Part 1 – PushpaTheRise
Part 2 – #Pushpa2TheRule
Part 3 – Pushpa3TheRampage#AlluArjun x #Sukumar 🚨🔥 pic.twitter.com/h0KrkmWVD8— Tharani ᖇᵗк (@iam_Tharani) December 3, 2024
Allu Arjun | ఐదేళ్ల నుంచి ఒకే హీరోయిన్ : పుష్ప 2 ది రూల్ ఈవెంట్లో అల్లు అర్జున్
Allu Arjun | పుష్ప 2 ది రూల్‌కు సపోర్ట్.. ఏపీ ప్రభుత్వానికి అల్లు అర్జున్ ధన్యవాదాలు