Uppena Director Buchibabu Sana | ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మారిన బుచ్చిబాబు.. సుకుమార్‌కు ప్రియశిష్యుడు. ఉప్పెన చిత్రంతో బుచ్చిబాబును దర్శకుడిగా పరిచయం చేసిన సుకుమార్… ఆయన రెండో సినిమాకు కూడా కథ విషయంలో సుకుమార్ ఇన్పుట్స్ ఇస్తున్నాడని తెలిసింది.
ఉప్పెన విడుదలై రెండేళ్లు గడుస్తున్నా బుచ్చిబాబు రెండో సినిమా ఇప్పటి వరకు సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌ను ఈ యువ దర్శకుడు కలిసి స్టోరీ వినిపించాడని వార్తలు వినిపించాయి. అయితే ఆ కథలో ఎన్టీఆర్ కొన్ని మార్పులు చెప్పాడట. అయితే బుచ్చిబాబు ఈ విషయంలో తన గురువు సుకుమార్ కంట్రిబ్యూషన్స్ కోరాడు. ఆల్రెడీ పుష-2 ( Pushpa 2 ) కథ విషయంలో తుదిమెరుగులు దిద్దుతున్న సుకుమార్ బుచ్చిబాబు రెండో సినిమా కథ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు. అంతేకాదు పుష్ప-2 ( Pushpa – The Rule ) సినిమాను వీలైనంత తొందరగా సెట్స్ మీదకు తీసుకువెళ్లాలనుకున్న సుకుమార్‌కు బుచ్చిబాబు రెండో సినిమా కథ కాస్త ఇబ్బందిపెడుతుందని సమాచారం. అంతేకాదు కథ రాసుకోవడానికి అవుట్డోర్ వెళ్లినా సుకుమార్‌ను బుచ్చిబాబు వదలడం లేదని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
“Rashmika Mandanna | పుష్ప 2 ఆలస్యం..ఆనందంలో రష్మిక..అదేంటీ..?”
“Pushpa 3 | ‘పుష్ప 3’ కూడా ఉండబోతుందట..ఫహద్ ఫాసిల్ క్లారిటీ..!”