Manoj Bajpayee | ‘పుష్ప’ సీక్వెల్లో మనోజ్ బాజ్‌పాయ్.. క్లారిటీ ఇచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ హీరో
Manoj Bajpayee Clarifies Rumours About Acting In Pushpa-2 | బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘ప్రేమకథ’, ‘హ్యపీ’, ‘కొమరం పులి’, ‘వేదం’ వంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అమెజాన్ సంస్థ రూపొందించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే ‘పుష్ప’ సీక్వెల్లో మనోజ్ బాజ్‌పాయ్ కీలకపాత్ర పోషిస్తున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై మనోజ్ క్లారిటీ ఇచ్చాడు.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘పుష్ప’. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఎవరు ఊహించని స్థాయిలో కలెక్షన్లను సాధించింది. ఇక ఎలాంటి ప్రమోషన్లు చేయకుండానే హిందీలో 100 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక పుష్ప-2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర కోసం మేకర్స్ మనోజ్ బాజ్‌పాయ్‌ను సంప్రదించారని గత కొన్ని రోజులుగా వార్తలు వాచ్చాయి. తాజాగా ఈ వార్తలపూ మనోజ్ స్పందించి ‘ఇంతవరకు పుష్ప మూవీ సీక్వెల్ కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు..సోషల్ మీడియాలో వస్తున్న వార్తలేవీ నిజం కాదు’.. అని క్లారిటీ ఇచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

