‘పురుషః’ మేల్ ఓరియెంటెడ్ మూవీ అని, ఇదొక సరికొత్త జోనర్ సినిమాగా ప్రేక్షకుల్ని అలరిస్తుందని చెప్పారు దర్శకుడు వీరు వులవల. పవన్‌కల్యాణ్ బత్తుల హీరోగా సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘పురుషః’ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు వీరు వులవల విలేకరులతో ముచ్చటించారు.
తాను బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశానని, ‘కొత్త బంగారులోకం’ టైటిల్‌ను డిజైన్ చేసింది తానేనని, ఇప్పటివరకు ఇండస్ట్రీలో 350కిపైగా టైటిల్స్‌కు డిజైన్ చేశానని చెప్పారు. ‘పురుషః’ కథ గురించి చెబుతూ ‘ఆద్యంతం వినోదప్రధానంగా సాగే కథ ఇది. ప్రేమకోసం ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తిగా హీరో పవన్‌కల్యాణ్ కనిపిస్తారు. సప్తగిరి, కసిరెడ్డితో ఆయన పండించే హాస్యం హైలైట్‌గా నిలుస్తుంది. వెన్నెల కిషోర్ పాత్ర కూడా కడుపుబ్బా నవ్విస్తుంది. ఇందులో ఆరు పాటల్ని నేచురల్ లోకేషన్స్‌లో తెరకెక్కించాం. ఈ వేసవిలో ప్రేక్షకులకు వందశాతం వినోదాన్ని పంచే సినిమా అవుతుంది’ అన్నారు.