ఫిలిం మేకింగ్‌లో ఫ్రంట్ ఫుట్ తప్ప డిఫెన్స్ ఆడటం రాని దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). అందుకే ఆయన సినిమాలు పడితే గ్రౌండ్ అవతల, లేకుంటే క్లీన్ బౌల్డ్ అవుతుంటాయి. ఈ సక్సెస్, ఫెయిల్యూర్ ఎలా ఉన్నా పూరీ జగన్నాథ్ టాలీవుడ్లో ఒక ట్రెండ్ సెట్టర్. చాలా మంది యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌కు ఇన్సిపిరేషన్.
విజయ్ దేవరకొండతో ఆయన రూపొందించిన ‘లైగర్’ రిలీజ్ ముందు మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ కూడా పూరీనే. ఆయనతో మహేష్ బాబు, చిరంజీవి వంటి స్టార్స్ సినిమా ప్రపోజల్స్ ఉండేవి. ‘లైగర్’ ఫ్లాప్ తర్వాత ఆయన లైనప్ మొత్తం మారిపోయింది. ఆ మధ్య చిరంజీవి ‘గాఢ్ ఫాదర్’ సినిమా ప్రమోషన్స్‌లో పూరి పాల్గొన్నాడు. చిరంజీవితో ప్రత్యేకంగా ఓ జూమ్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా ఆయనతో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్నట్లు చిరంజీవి చెప్పాడు. కథ రెడీ చేసుకోమన్నాడు. పూరి కూడా గతంలో తాను అనుకున్న ఆటో జానీ వద్దని, కొత్త కథ తెస్తానని చెప్పాడు.
చిరంజీవి ప్రస్తుతం ఉన్న సినిమాలు చూస్తే ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యమయ్యేలా ఉంది. అయితే తాజాగా పూరీ మరో హీరోను అప్రోచ్ అవుతున్నట్లు తెలిసింది. అతను మరెవరో కాదు తానే మొక్కగా నాటి చెట్టైన రవితేజ (Ravi teja). ‘దేవుడు చేసిన మనుషులు’ తర్వాత రవితేజ పూరీ జగన్నాథ్ కలిసి సినిమా చేయలేదు. ఆ సినిమా ఫ్లాప్ వీరిని అన్ని విధాలా దూరం చేసింది.
పూరీ సినిమా చేసే మూడ్‌లో లేడు అని రవితేజ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేంత వరకు ఈ గ్యాప్ వెళ్లింది. ఎంతైనా తనను కిందస్థాయి నుంచి స్టార్‌ను చేసిన దర్శకుడు కాబట్టి పూరీతో రవితేజ సినిమా చేసే అవకాశాలున్నట్లుగానే తెలుస్తున్నది. రవితేజ ఇలాంటి పరిస్థితిలోనే దర్శకుడు శ్రీను వైట్లతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా చేశాడు.
Read also :Pathaan | ఎనిమిది దేశాల్లో పఠాన్ యాక్షన్ సీన్లు షూట్.. మేకర్స్ స్టన్నింగ్ అప్డేట్
Read also : Uorfi Javed | నువ్వు నా దుస్తులతో పోటీపడలేవు.. సన్నీలియోన్ పొగడ్తలపై ఉర్ఫీ జావెద్
Read also :GautamGhattamaneni | స్టేజ్‌పై మహేశ్ బాబు కొడుకు గౌతమ్ యాక్టింగ్.. ట్రెండింగ్‌లో వీడియో