Rajvir Jawanda | చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే సింగపూర్లో అస్సాం గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg) మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్త మరవకముందే పంజాబీ సింగర్ (Punjabi Singer) రాజ్వీర్ జవందా (Rajvir Jawanda) ప్రాణాలు కోల్పోయారు.
రాజ్వీర్ జవందా గతనెల 27న బైక్పై హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) సిమ్లాకు బయల్దేరారు. బద్ది ప్రాంతంలో ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు (Road Accident). ఈ ప్రమాదంలో రాజ్వీర్ జవందా తల, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో గాయకుడు గుండెపోటుకు కూడా గురైనట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక గత 11 రోజులుగా మొహాలీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజ్వీర్ జవందా.. ఈరోజు ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని పంజాబీ నటి నీరూ బజ్వా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రాజ్వీర్ వయసు ప్రస్తుతం 35. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.
Also Read..
Tata Group | టాటా గ్రూప్లో ఆధిపత్య పోరు.. రంగంలోకి కేంద్రం..?
Karur stampede | కరూర్ తొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీవీకే