Puneeth rajkumar | హీరోలు అనేది అభిమానులకు కేవలం సినిమాల వరకే పరిమితం కాదు.. వాటిని దాటి వాళ్లను అభిమానిస్తారు ఫ్యాన్స్. వాళ్లు చేసే ప్రతి పనిని ముందుండి ముందుకు తీసుకెళ్తారు. అలాంటి హీరోలకు ఏదైనా జరిగితే అస్సలు తట్టుకోలేరు అభిమానులు. అలాంటిది వాళ్ల ప్రాణం మీదికి వస్తే తమ ప్రాణం పోయినట్టుగా విలవిలలాడతారు. కన్నడనాట ప్రస్తుతం ఇదే జరుగుతుంది. నెం 1 హీరోలు అర్ధాంతరంగా చనిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇప్పుడు మరో విషాదం పునీత్ రాజ్ కుమార్ విషయంలో జరిగింది.
కేజీఎఫ్ సినిమా హిట్టయింది కదా అని కన్నడలో యష్ నెం 1 హీరో అనుకుంటే పొరపాటే. అక్కడ ఆ స్థానం గత కొన్ని ఏళ్లుగా పునీత్ సొంతం. ఎంత మంది హీరోలు వచ్చిన ఆయన ప్లేస్ మాత్రం ఎవరూ అందుకోలేకపోయారు. సినిమా సినిమాకు తన మార్కెట్ పెంచుకోవడమే కాకుండా.. కన్నడ సినిమా స్థాయిని కూడా పెంచిన హీరో పునీత్. అలాంటి అగ్రహీరో ఇప్పుడు అర్ధంతరంగా గుండెపోటుతో మరణించాడు. ఎంతో ఆరోగ్యంగా ఉండే ఈ హీరో జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసి అభిమానులు, సినీ ప్రముఖులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయితే కన్నడలో ఇలా స్టార్ హీరోలు ఆకస్మిక మరణం చెందడం ఇది తొలిసారి కాదు.
గతంలో ఇద్దరు హీరోల విషయంలో ఇదే జరిగింది.
2009లో కన్నడ మెగాస్టార్ విష్ణువర్ధన్ 58 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు. చనిపోయే సమయానికి ఆయన అగ్ర హీరో. 200 సినిమాలకు పైగా నటించిన విష్ణువర్ధన్.. కన్నడ ఇండస్ట్రీలో రాజ్ కుమార్ తర్వాత నెంబర్ వన్ ప్లేస్ అందుకున్నాడు. ఇక 1990లో శంకర్ నాగ్ అనే హీరో కూడా కేవలం 35 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఆయన చనిపోయే సమయానికి కన్నడలో స్టార్ హీరో. వరుస విజయాలతో చేతిలో దాదాపు 10 సినిమాలు ఉన్నాయి. శంకర్ నాగ్ చనిపోయిన 4 ఏళ్ల వరకు ఆయన నటించిన సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయంటే అతడి స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో శంకర్ నాగ్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం. ఒక సినిమా షూటింగ్లో భాగంగా కార్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు ఈయన. ఇలా కన్నడ నాట అగ్ర హీరోలను అకాల మృత్యువు ఎన్నో సంవత్సరాలుగా వెంటాడుతూనే ఉంది. అంతెందుకు గత ఏడాది చిరంజీవి సర్జా కూడా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు గుండెపోటుతో మరణించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పునీత్ రాజ్ కుమార్ పై 400 కోట్ల పెట్టుబడులు.. ఆ సినిమాల పరిస్థితి ఏంటి..?
పవర్ స్టార్ పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది మన పూరీ జగన్నాథ్‌నే
పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుకు కారణం అదేనా?
Puneeth rajkumar movies పునీత్ రాజ్ కుమార్ చేసిన తెలుగు రీమేక్స్ ఇవే..
power star | పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్
రియల్ హీరో పునీత్ రాజ్ కుమార్.. ఆయన చేసి సేవల గురించి తెలుసా
గతేడాది చిరంజీవి సర్జా.. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్.. కన్నడ సినిమాకు చీకటి రోజులు