Puneeth rajkumar | అతి తక్కువ సమయంలో అశేష ప్రేక్షకాదరణ పొందిన నటుడు పునీత్ రాజ్ కుమార్. చిన్న వయస్సులో ఆయన మృతి చెందడం ప్రతి ఒక్కరికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఆన్‌స్క్రీన్‌లోనే కాక ఆఫ్ స్క్రీన్‌లోను పునీత్ హీరోనే. ఆయన ఎంతోమందికి చేతనంత సాయం చేశారు. ఇప్పుడు అతడు లేరని తెలుసుకున్న అభిమానులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.
పొన్నాచ్చి తాలూకాలోని మరూరుకి చెందిన మునియప్పన్ అయితే పునీత్ లేడని తెలిసి గుండెపోటుతో మరణించాడు. పునీత్ అంటే ప్రాణం. పునీత్ చనిపోయారనే వార్త తెలియగానే మునియప్పన్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ని దగ్గరలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. మునియప్పన్‌కు ఏడాది వయసున్న పాప ఉంది. ఈ సంఘటన అభిమానులని మరింత బాధిస్తుంది.
పునీత్ మరణ వార్త తర్వాత కర్ణాటక ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. థియేటర్స్‌ను మూసి వేసింది. మద్యపాన విక్రయాలపై ఆదివారం వరకు ప్రభుత్వం నిషేధం విధించింది. శనివారం పునీత్ అంత్యక్రియలు జరుగుతాయి. పునీత్ రాజ్‌కుమార్ కుమార్తె అమెరికా నుంచి వచ్చిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పునీత్ రాజ్ కుమార్ పై 400 కోట్ల పెట్టుబడులు.. ఆ సినిమాల పరిస్థితి ఏంటి..?
పవర్ స్టార్ పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది మన పూరీ జగన్నాథ్‌నే
పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుకు కారణం అదేనా?
Puneeth rajkumar movies పునీత్ రాజ్ కుమార్ చేసిన తెలుగు రీమేక్స్ ఇవే..
power star | పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్
రియల్ హీరో పునీత్ రాజ్ కుమార్.. ఆయన చేసి సేవల గురించి తెలుసా
గతేడాది చిరంజీవి సర్జా.. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్.. కన్నడ సినిమాకు చీకటి రోజులు