శ్రీనందు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. వరుణ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీనందు, శ్యామ్‌సుందర్ రెడ్డి నిర్మాతలు. యామిని భాస్కర్ కథానాయికగా నటిస్తున్నది. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. హీరో శ్రీనందు మాట్లాడుతూ ‘ఈ సినిమాకు ‘మీలాంటి యువకుడి కథ’ అనే క్యాప్షన్ పెట్టాం. ఇప్పుడున్న యూత్‌కి కనెక్ట్ అయ్యే కథ ఇది. ఇండస్ట్రీకొచ్చి 18ఏళ్లవుతున్నది. ఇప్పటివరకు నేను చేసిన ప్రతీ పాత్రకు న్యాయం చేశా. ఒకవేళ ఈ సినిమా మీకు నచ్చకపోతే ప్రెస్‌మీట్ పెట్టి మరీ క్షమాపణలు చెబుతాను. సినిమా ఫెయిల్ అయినా గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉంటా’ అన్నారు. నిర్మాత సురేష్‌బాబుకు ఈ సినిమా బాగా నచ్చిందని, వెంటనే ఆయన థియేట్రికల్ హక్కుల్ని తీసుకున్నారని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్‌సాయి, నిర్మాణం: స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్రోలింగ్ పిక్చర్స్, దర్శకత్వం: వరుణ్ రెడ్డి.