న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రిజర్వ్‌బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. మెరుగైన పనితీరు, ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉన్న ఎంఎస్ఎంఈలకు ఇచ్చే హామీ రహిత రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచాలని బ్యాంకులకు సూచించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతోపాటు బ్యాంక్‌ల క్రెడిట్ గ్యారెంటీ స్కీం ప్రయోజనాలు కూడా కల్పించాలని పేర్కొంది.
బ్యాంకులు మంజూరు చేసే రుణాల కోసం రుణగ్రహీతలు స్వచ్ఛందంగా తాకట్టుపెట్టే బంగారం, వెండిని తాకట్టు రహిత పరిమితికి పూచీకత్తుగా అంగీకరించడంపై ఆదేశాల ఉల్లంఘనగా పరిగణించరాదని సవరించిన ఆదేశాల్లో పేర్కొంది. ప్రధానమంతి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రొగ్రామ్(పీఎంఈజీపీ) కింద చిన్న సంస్థలకు రూ.20 లక్షల వరకు హామీ రహిత రుణాలు ఇవ్వనున్నారు.