Telugu Film Industry| తెలంగాణ 5..ఆంధ్రా 3..మధ్యలో నలిగిపోతున్న నిర్మాతలు..!
శివుడికి మూడు కళ్ళున్నట్లు..తెలుగు సినీ ఇండస్ట్రీ (Telugu Film Industry)కు కూడా మూడు కళ్లు ఉన్నాయి. అందులో ఒకటి తెలంగాణ..మరొకటి ఆంధ్ర..మూడోది రాయలసీమ. ఎన్నో దశాబ్దాలుగా ఈ మూడు..మన సినిమా వసూళ్లకు ఆయువు పట్టు.

శివుడికి మూడు కళ్ళున్నట్లు..తెలుగు సినీ ఇండస్ట్రీ (Telugu Film Industry)కు కూడా మూడు కళ్లు ఉన్నాయి. అందులో ఒకటి తెలంగాణ..మరొకటి ఆంధ్ర..మూడోది రాయలసీమ. ఎన్నో దశాబ్దాలుగా ఈ మూడు..మన సినిమా వసూళ్లకు ఆయువు పట్టు. వీటిలో ఏది చిన్నది కాదు..ఏది పెద్దది కాదు. అన్ని చోట్లా అన్ని సినిమాలు బాగా ఆడతాయి. తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలు (Telugu States) గా విడిపోయిన తర్వాత ఆంధ్ర, తెలంగాణ రెండు కళ్లుగా మారిపోయాయి. రాష్ట్రం మధ్యలో సరిహద్దు గీశారు కానీ ప్రేక్షకుల మనసులో కాదు. అందుకే మన సినిమాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా సంచలన విజయం సాధించాయి. రెండు చోట్ల కూడా అద్భుతం చేశాయి. రెండు సంవత్సరాల వరకు అంతా బాగానే జరిగింది. కానీ 2020 వేసవిలో ఒక మహమ్మారి మన దేశంలోకి వచ్చింది. దాని పేరు కరోనా వైరస్.
అది వచ్చిన తర్వాత థియేటర్లు మూత పడ్డాయి. 7 నెలల వరకు వాటి జోలికి కూడా పోలేదు ఎవరు. ప్రపంచ సినీ చరిత్రలో తొలిసారిగా ఏడు నెలలకు పైగా సినిమా థియేటర్లు (Cinema Theatres) మూతపడటం ఇదే తొలిసారి. పరిస్థితులు చక్కబడతాయి అనుకుంటున్న తరుణంలో మళ్లీ రెండో దశ కరోనా వైరస్ వచ్చి చావుదెబ్బ కొట్టింది. ప్రస్తుతం కేసులు తగ్గిపోవడంతో తెలంగాణలో 100% ఆక్యుపెన్సీతో నాలుగు షోలు ప్రదర్శించవచ్చు అని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇప్పటికీ కేవలం మూడు వరకు మాత్రమే అనుమతి ఉంది. అక్కడ సెకండ్ షోలకు పర్మిషన్ ఇవ్వలేదు ప్రభుత్వం. మరోవైపు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు టికెట్ రేట్లను కూడా తగ్గించింది జగన్ ప్రభుత్వం.
ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 5 షోలు వేసుకోవచ్చు అంటూ అనుమతి ఇచ్చేలా కనిపిస్తుంది. ఈ విషయంపై చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. తాజాగా కొందరు ఎగ్జిబిటర్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై మంత్రి కూడా సానుకూలంగానే స్పందించారని తెలుస్తోంది. ఇకపై తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ లో కూడా 5 షోలు ప్రదర్శించేలా అనుమతి జారీ చేసేలా కనిపిస్తోంది. కానీ ఆంధ్రాలో మాత్రం ఇప్పటికీ కేవలం 3 షోలకు మాత్రమే అనుమతి ఉంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయలేక నిర్మాతలు నలిగిపోతున్నారు. కేవలం నైజాం కలెక్షన్స్ మాత్రమే కావాలి అనుకుంటే సినిమాలు విడుదల చేసుకోవాలి. అలా కాదు రెండు రాష్ట్రాల్లో కలెక్షన్స్ కావాలి అనుకుంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇవి కూడా చదవండి..
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
శృతి హాసMahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

