Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ స్టార్ యాక్టర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. తాజాగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చేయబోతున్న సినిమాపై ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఈ ఇద్దరు ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారంటూ ఇండస్ట్రీ సర్కిల్లో జోరుగా చర్చ నడుస్తుంది. కాగా నిర్మాత సాహు గారపాటి ఆ సస్పెన్స్‌కు పుల్‌స్టాప్ పెట్టేశాడు.
సినిమాలో ఎలాంటి సందేశం ఉండదు. యాక్షన్ ఎలిమెంట్స్‌తో సాగే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇది. మేమంతా చిరంజీవి సినిమాలు, ఆయన ట్రేడ్ మార్క్ ఎలిమెంట్స్ చూస్తూ ఎదిగినవాళ్లం. అనిల్ రావిపూడి స్టైల్లో మెగాస్టార్‌ను చూడబోతున్నామన్నాడు. అనిల్ రావిపూడి ఫ్లేవర్ కామెడీతో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్లా ఉండబోతుందని స్పష్టం చేశారు. ఇప్పుడీ కామెంట్స్‌తో చిరంజీవి నుంచి పర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమా రాబోతుందని అర్థమవుతోంది.
చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర, శ్రీకాంత్ ఓదెల సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఇవి పూర్తి కాగానే అనిల్ రావిపూడి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నాడట. కాగా అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేశ్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం చేస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా 2025 జనవరి 14న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
Naga Vamsi | అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా కోసం స్పెషల్ స్టూడియో.. నాగవంశీ కామెంట్స్ వైరల్
Second Marriages | 2024 రౌండప్.. రెండోసారి పెళ్లి పీటలెక్కిన సెలబ్రిటీలు వీళ్లే..!