Mullapudi Brahmanandam | టాలీవుడ్లో విషాదం.. ‘ఓ చిన్నదానా’ చిత్ర నిర్మాత కన్నుమూత
తెలుగు సినిమా నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం(68) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆదివారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న తన కమారుడు వచ్చాక బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
Mullapudi Brahmanandam | తెలుగు సినిమా నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం(68) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆదివారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న తన కమారుడు వచ్చాక బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు దగ్గరి బంధువు ముళ్లపూడి బ్రహ్మానందం. ఈవీవీ ప్రోత్సాహంతోనే ఆయన చిత్రరంగంలోకి అడుగుపెట్టారు. నేను, అల్లుడుగారు వచ్చారు, మనోహరం, ఓ చిన్నదానా చిత్రాలను నిర్మించారు. ఆయన మృతి పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ సంతాపం వెలిబుచ్చింది. ఆయన కుటుంబ సభ్యలకు సానుభూతిని తెలియజేసింది.