Priyanka Chopra | ప్రియాంక చోప్రా తనవారందరికీ ఓ ఫొటో ఛాలెంజ్ విసిరింది. తొమ్మిదేండ్ల వయసులో ఉన్న తన ఫొటోకు, 17ఏండ్ల వయసులో తాను మిస్ వరల్డ్ గెలుచుకున్న నాటి ఫొటోను జత చేసి తన ఇన్‌స్టాలో షేర్ చేసింది ప్రియాంక.
‘ఈ ఫొటోల్లో ఒకటి నా తొమ్మిదేండ్ల నాటి ఫొటో. క్రాఫ్‌తో అబ్బాయిలా ఉన్నాను. స్కూల్లో చదువుతున్న రోజులవి. రెండోది నేను మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిచిన నాటి ఫొటో. అప్పటికి నా వయసు 17ఏండ్లు. ఆ రోజులు ఇప్పటికీ జ్ఞాపకమే. అప్పుడప్పుడే జీవితంలో స్థిరపడుతున్న క్షణాలవి. వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో సంభవించిన మార్పులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మీకు మీరే స్ఫూర్తి. ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడి ఉంటాం. ఆ స్ఫూర్తే నేటికీ మనల్ని ముందుకు నడిపిస్తుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ చిన్ననాటి ఫొటోకి రీసెంట్ ఫొటోతో పోలుస్తూ కామెంట్స్ పెట్టండి.. ’ అంటూ ప్రియాంక అభిమానుల్ని కోరింది.