Priyanka Chopra| గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం #SSMB29గా భారీ బడ్జెట్తో రూపొందుతోంది. గత 15 రోజులుగా ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతూ వచ్చింది. సిమిలిగుడ సమీపంలోని మాలి, పుట్సీల్, బాల్డ ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. మంగళవారం రాత్రి ఒడిశా షెడ్యూల్ పూర్తికావడంతో నటీనటులను చూసేందుకు అక్కడి అభిమానులు భారీగా వచ్చారు. ఇక యూనిట్ సభ్యులందరూ మంగళవారం రాత్రే హైదరాబాద్కు బయలుదేరగా, రాజమౌళి, మహేశ్ బాబు బుధవారం ఉదయం ఆ ప్రాంతాన్ని వీడారు.
అయితే చిత్ర షూటింగ్ పూర్తయ్యాక అక్కడి లోకల్ అధికారులు మహేష్, రాజమౌళి, ప్రియాంక చోప్రాతో దిగిన ఫోటోలు, రాజమౌళి అక్కడి యూత్ తో వాలీబాల్ ఆడిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేశాయి. ఇక షూటింగ్ అయిపోవడంతో ప్రియాంక చోప్రా న్యూయార్క్ బయలుదేరింది. ఇక తాజా పోస్ట్ లో షూటింగ్ లొకేషన్స్, దారి పొడవు అందాలు అన్నింటిని చిత్రీకరించి షేర్ చేసింది. ఒడిశా కోరాపుట్ నుంచి వైజాగ్ వరకు కార్ లో వచ్చి వైజాగ్ టు ముంబై, ముంబై టు న్యూయార్క్ వెళుతున్నట్టు ప్రియాంకచోప్రా చెప్పుకొచ్చింది.
అలానే దారిలో జరిగిన విషయాన్ని వివరించింది. జామకాయలు అమ్మే ఒక మహిళా తన వద్ద ఉన్న కాయలు 150 రూపాయలు అని చెప్తే 200 ఇచ్చి చిల్లర ఉంచుకోమంటే చిల్లర లేకపోవడంతో ఇంకొన్ని కాయలు ఇచ్చింది. వర్కింగ్ ఉమెన్ ఛారిటీ కదా డబ్బులు తీసుకోరు అంటూ ప్రియాంక చోప్రా పేర్కొంది. ఇక ఒడిశా నుంచి వైజాగ్ దారిలో వస్తుండగా పక్కన కాలువలు, పొలాలు, రోడ్లు, షూటింగ్ సెట్ లో తీసుకున్న ఫోటోలు, వీడియోలు అన్నింటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక. ఇక ఈ సినిమా విషయానికి వస్తే రాజమౌళి మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికనా లేదంటే కీ రోల్ పోషిస్తుందా అనే దానిపై క్లారిటీ లేదు.